ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల మార్చి 2024 నెలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ తేదీలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెల వరకు 300/- టికెట్స్ ఇతర సేవ టికెట్స్ , రూమ్స్ అన్ని బుక్ అయిపోగా మార్చి 18-20 తేదీల్లో ఉదయం 10 గంటల వరకు లక్కి డ్రా టికెట్స్ విడుదల చేస్తున్నారు. 20 వ తేదీ 12 గంటలకు సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ లు చేస్తారు . 22వ తేదీ 12 గంటల వరకు పే మెంట్ చేయడానికి అవకాశం ఇస్తారు.
21వ తేదీ 10am కు కళ్యాణం , ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ లు విడుదల. ఈ టికెట్ బుక్ చేసిన వారికి సేవ దర్శనం ఉంటుంది. 21వ తేదీ 3pm కు ఆన్ లైన్ సేవ విడుదల. సేవ ఉండదు దర్శనం మాత్రమే ఉంటుంది. 23వ తేదీ 10am కు అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల కానుండగా 23వ తేదీ 3 pm కు వయో వృద్దులు , వికలాంగుల టికెట్స్ విడుదల కానున్నాయి.
25వ తేదీ 10am కు 300/- దర్శనం టికెట్స్ ,25వ తేదీ 3pm కు తిరుమల & తిరుపతి రూమ్స్ విడుదల చేయనున్నారు. టికెట్స్ లేని వారికి తిరుపతి లో ఏ రోజుకి ఆ రొజు టికెట్స్ ఇస్తారన్నారు.
()రోడ్డు మార్గం లో వెళ్లేవారికి టికెట్స్ ఇచ్చే ప్రదేశాలు.
1) గోవింద రాజుల సత్రాలు ( 6వ నంబర్ ఫ్లాట్ ఫామ్ పక్కన)
2) విష్ణు నివాసం ( రైల్వే స్టేషన్ ఎదురుగా)
3) శ్రీనివాసం ( బస్ స్టాండ్ కు ఎదురుగా)
టికెట్స్ ఇచ్చే సమయాలు : 3:30am నుంచి ఇస్తారు ప్రతి రోజు 10 వేల టికెట్స్ ఇస్తారు, ఆ టికెట్స్ అయిపోయేవరకు ఇచ్చి కౌంటర్ క్లోజ్ చేస్తారు. సాధారణంగా ఉదయం 6-7 వరకు ఉంటున్నాయి.
Also Read:మాజీ డీఎస్పీ…మనసులో మాట
() కాలినడకన వెళ్లేవారికి
1) అలిపిరి మెట్ల మార్గం లో వెళ్లేవారికి భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు ఉదయం 3 గంటల నుంచి.
నడకదారి టైం :4am -10pm
2) శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లేవారికి మెట్ల మార్గం మధ్యలో ఇస్తున్నారు. సమయం 6am – 6pm
మీకు ఈ టికెట్స్ దొరకకపోతే కొండపైకి వెళ్లి ఉచిత దర్శనం లైన్ లోకి వెళ్ళవచ్చు.
మీకు రూమ్ బుక్ అవ్వకపోతే .. కొండపైన cro ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు. అక్కడ లైన్ లో నిలబడండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇస్తారు. 24 గంటలకు మాత్రమే రూమ్ ఇస్తారు. రెండు రోజులకు ఇవ్వరు.
12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్స్ తీయనవసరం లేదు.
65 సంవత్సరాలు వస్తేనే సీనియర్ సిటిజన్ దర్శనానికి అర్హులు.