హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఐపీఎల్ హిస్టరీలోనే ముంబై ఇండియన్స్ కు నాలుగు కప్ లు అందించిన ఘనత హిట్ మ్యాన్ ది. కెప్టెన్ గా ఇన్నో మరపురాని విజయాలు అందించిన రోహిత్ శర్మ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో హిట్ మ్యాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ వైపు ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ పై చెప్పినప్పటికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంకా ఐపీఎల్ లో చెన్నై తరుపున కెప్టెన్ గా కొనసాగుతున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆయనే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారా ? లేదా జట్టు యాజమాన్యం తప్పించ్చిందా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది కెప్టెన్ గా రోహిత్ శర్మ కు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పాలి.
ఐపీఎల్ 2023 కప్పు గెలవలేక పోయిన రోహిత్.. ఆ తరువాత అతని కెప్టెన్సీ లోనే టీమిండియా ఐసీసీ టోర్నీలలో కప్పు లను తృటిలో చేజార్చుకుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి, అలాగే ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఓటమే ఎదురైంది. ఇప్పుడు తాజాగా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీ నుంచి తొలగింపు ఇలా ఓవరాల్ గా చూస్తే 2023 రోహిత్ శర్మకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. కాగా ఏ ఏడాది జరిగిన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని స్వయంగా రోహిత్ శర్మనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పికున్నాడని కొందరు క్రీడా విశ్లేషకులు చెబుతున్నా మాట. రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. మరి ఇన్నాళ్లు రోహిత్ కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా నిలిచిన ముంబై.. పాండ్య కెప్టెన్సీలో ఎలా రాణిస్తుందో చూడాలి.
Also Read:మాజీ డీఎస్పీ…మనసులో మాట