సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ గురైంది.పవన్ ట్విట్టర్ ఖాతాకు మూడు రోజులుగా అంతరాయం ఏర్పడడంతో… ట్విట్టర్ ఖాతాలోనే ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడిందనుకున్నారు పవన్. కాగా.. బుధవారం ఖాతా పూర్తిగా బ్లాక్ ఆయిపోవడంతో… అప్రమత్తమైన పవన్ దీనిపై తన కార్యాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. హ్యాకర్లు తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారని తెలియడంతో… హ్యాకింగ్‌పై నిపుణులను సంప్రదిస్తున్నారు జనసేనాని. పవన్ తన అభిప్రాయాలను పంచుకోవడానికి ట్విట్టర్ వేదికగా ఆక్టివ్‌గా ఉంటారు.
భారత దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన వారిలో పవన్ ఒకరు.ప్రస్తుతం పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన రికార్డు పవన్ కల్యాణ్ పేరుమీదే ఉండడం విశేషం. హైదరాబాద్‌లో ‘దద్దరిల్లిన ధర్నాచౌక్’ అంశంపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్‌వర్డ్ ఛేంజ్ అయినట్లు మెసేజ్ డిస్‌ప్లే అయిందని పవన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.