జూన్‌లో రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘ఏక్త’..!

223
Ekta Design
- Advertisement -

సుమ‌న రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు,హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న సినిమా ఏక్త‌. మిస్ ఇండియా 2013 నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, రాబిన్‌ సోహి జంటగా న‌టిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. విరాట్‌ సినిమాస్‌ సమర్పణలో బి.ఎస్‌ ప్రొడక్షన హౌస్‌ పతాకంపై బిక్షమయ్య సంగం, సుమనరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కేరళ, అలెప్పీలో కీలక సన్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మే లో లేదా జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. నసీర్‌ఖాన్‌, నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, బాహుబలి ప్రభాకర్‌తో కలిసి పనిచేయడం ఆనందాన్నిచ్చింద‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు. దబు మల్లిక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఆర్మన్‌ మల్లిక్‌ ఓ ప్రత్యేక గీతం ఆల‌పించారు.

నసీర్‌ఖాన్‌, సలీల్‌ ఆంకోలా, ప్రణతిరాయ్‌ ప్రకాష్‌, బాహుబలి ప్రభాకర్‌, రుషద్‌ రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తమశ్యామ్‌ సంగీతం: దబు మల్లిక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సుమన్‌రెడ్డి.

Ekta movie Release  soon

- Advertisement -