ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వార్ గట్టిగానే సాగింది. పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తే కొన్ని చిన్న సినిమాలను అంచనాలు లేకుండానే వచ్చే బ్లాక్ బాస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నాయి. అయితే రీమేక్ సినిమాలకు మాత్రం ఈ ఏడాది కాస్త నిరాశే మిగిలింది. ఎందుకంటే వసూళ్ల పరంగా సక్సెస్ సాధించలేకపోయాయి. ఫ్లాప్ అయిన రీమేక్ సినిమాలను ఓ సారి పరిశీలిద్దాం.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి భోశా శంకర్ గురించి మాట్లాడుకుంటే. భారీ అంచనాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. అజిత్ వేదాళం సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాతో దర్శకుడిగా మెహర్ రమేష్ కెరీర్ సందిగ్దంలో పడగా నిర్మాతలు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు.
ఇక మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్‌ది ఇదే పరిస్థితి. మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో చేసి బ్రో అంతగా ఆకట్టుకోలేదు. వినోదయ సీతంకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర ది సేమ్ సిచ్యువేషన్. బెంగాళీ సినిమకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమా.. మరాఠీలో ఎన్నో అవార్డులు అందుకున్న నట సామ్రాట్ ఆధారంగా తెరకెక్కింది. సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటను మంచి మార్కులే పడ్డా వసూళ్లు మాత్రం అంతగా రాలేదు. కథ, సెంటిమెంట్ సినిమాకు ప్లస్ అయినా కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ కూడా అంతే. పోలీస్ ఆఫీసర్‌గా స్వలింగ సంపర్కుడి పాత్రలో నటించారు సుధీర్ బాబు. ముంబై పోలీస్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
Also Read:Bigg Boss 7:పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల