- Advertisement -
ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రజావాణి ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని,ప్రజల సౌకర్యార్థం తీగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
Also Read:హ్యాపీ బర్త్ డే.. నభా నటేష్
- Advertisement -