సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వారు ఎన్నో కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం సినిమాల పరంగానే కాదు, పర్సనల్ గా కూడా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. హీరోయిన్‌గా ఓ రేంజ్ లో ఉండాలనుకునే వారు కెరీర్ స్టార్టింగ్‌లో మాత్రం భయంభయంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే..హీరోయిన్ అవ్వాలన్నకోరికతో ఎక్కడెక్కడనుండో ఇండస్ట్రీకి వస్తున్నవారు కెరీర్ గాడినపడే వరకు అద్దెఇంటితో సరిపెట్టుంటుంటారు.
ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్టైపోతోంది. బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కర్ణాటక నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్రెండ్‌తో కలిసి వుంటోంది. ఇటీవల హౌసింగ్ సొసైటీ ఆమెకి ఓ షాకిచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నది వాళ్ల డిమాండ్. ఆరు నెలలుగా ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నానని, సింగిల్‌గా వున్నా కూడా ఎలాంటి చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడలేదని అంటోంది.
మొదట్లో వచ్చిన హీరోయిన్లు ఇల్లు కోసం తీవ్రంగా ఇబ్బందులుపడతారని, షూటింగుల వల్ల ఏ సమయానికి ఇంటికి చేరుతారో తెలియదని, దాంతో పొరుగువాళ్లకి నచ్చకపోవడంతో ఫిర్యాదు చేసింది హౌసింగ్ సొసైటీ. దీంతో ఫ్లాట్ ఖాళీ చేయమని చెప్పడంతో రోడ్డున పడింది ఈ అమ్మడు. హీరోయిన్లకు ఇలాంటి సమస్యలు కొత్తేమీకాదు, గతంలో షబానా అజ్మీ, ఇమ్రాన్ హష్మి వంటి నటీనటులు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మున్నా మైఖేల్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. మరి ఈ అమ్మడు తన ప్రాబ్లమ్ ని ఏ రకంగా గట్టెక్కించుకుంటుందో చూడాలి.
రోడ్డున పడ్డ బాలీవుడ్ బ్యూటీ..
- Advertisement -
- Advertisement -