ప్రియాంక చోప్రా వీడియో కూడా వైరల్

39
- Advertisement -

డీప్‌ ఫేక్ టెక్నాలజీకి మరో స్టార్ హీరోయిన్ బలైంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు లిప్‌ సింక్‌ అయ్యేలా ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్లు రూపొందించారు. ఓ బ్రాండ్‌ ప్రకటనతో 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ ఆ బ్రాండ్‌నే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్‌ చేశారు. దీంతో ఇది నిజమే అనుకుని.. ఆమె అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయితే, ప్రియాంక చోప్రా సన్నిహితులు ఈ వీడియో చూసి ఇది డీప్ ఫేక్ వీడియో అని క్లారిటీ ఇచ్చారు.

ప్రియాంక చోప్రా తరుపున ఈ డీప్ ఫేక్ వీడియో పై తాము క్లారిటీ ఇస్తున్నాం అని.. దయచేసి ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను నమ్మొద్దు అని, ప్రియాంక చోప్రా ఎప్పుడూ ఇలాంటి చెత్త పనులు చేయదు అని, ఇక ఇలాంటి వీడియోల గురించి ఆలోచించే టైమ్ ప్రియాంక చోప్రాకి లేదని, కాబట్టి ఆమె ఈ డీప్ ఫేక్ వీడియోను సీరియస్ గా తీసుకోవడం లేదు అని ప్రియాంక చోప్రా సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఏమిటో, డీప్ ఫేక్ వీడియోలు.. రోజుకొక హీరోయిన్ పై ఇలాంటి వీడియోలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఈ డీప్ ఫేక్ బారిన పడింది. మరి రానున్న రోజుల్లో ఇంకెంత మంది పడతారో చూడాలి.

అన్నట్టు షారుఖ్ ఖాన్ హీరోగా రాబోతున్న ‘డంకీ’ నుంచి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ప్రీతం చక్రబోర్తి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఓ స్పెషల్ సాంగ్ చాలా బాగా ఆకట్టుకోబోతుంది అని… ఈ సాంగ్ లో ప్రియాంక చోప్రా నటించింది అని, అభిమానులకు సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఈ విషయాన్ని మేకర్స్ దాచారని టాక్ నడుస్తోంది. షారుఖ్ ఖాన్ కి – ప్రియాంక చోప్రాకి మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో మంచి సాంగ్స్ వచ్చాయి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మరో సాంగ్ రాబోతుంది.

Also Read:సీఎం రేవంత్‌కు హరీశ్ రావు విషెస్

- Advertisement -