నితిన్‌ కూడా పొగడ్తలు నేర్చుకున్నాడు

38
- Advertisement -

ఈ మ‌ధ్య ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఒక సెల‌బ్రిటీని మ‌రో సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూ చేయ‌డం చాలా కామ‌నైపోయింది. ఈ క్రమంలోనే నితిన్ ను స్టార్ బాయ్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఇంట‌ర్వ్యూ చేశాడు. నితిన్ న‌టించిన ఎక్స్‌ట్రా మూవీ డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నితిన్‌ ను టిల్లూ ఇంట‌ర్వ్యూ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంట‌ర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది. ఇందులో సిద్ధుతో బాతాఖానీ వేస్తూ తన సినిమా వివరాలను, సినిమాలో పాత్రల వివరాలను, తన క్యారెక్టర్ గురించిన సంగతులను నితిన్ పంచుకున్నారు.

ముఖ్యంగా నితిన్ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని.. సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి సిద్ధు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అన్నట్టు తాను హీరో అవ్వడానికి కారణం సీనియర్ హీరో రాజశేఖర్ అని నితిన్ అన్నారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్‌ ఈ వెంట్‌లో మాట్లాడుతూ, రాజశేఖర్ చేసిన మగాడు సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టే, మా నాన్న ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను.

ఒకవేళ ఆ సినిమా హిట్ కాకపోయి ఉంటే ఇండస్ట్రీకి దూరమయ్యేవారిమని నితిన్ చెప్పడం విశేషం. నితిన్, శ్రీలీల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలీల మంచి డాన్సర్ అని నాకు తెలుసు. ఆమెకి భరతనాట్యం, కూచిపూడి తెలుసు. మంచి హాకీ ప్లేయర్. స్విమ్మింగ్‌లో కూడా ఆమెకు రికార్డు ఉంది. త్వరలో మెడిసిన్ పూర్తి చేయబోతోందనే విషయం తక్కువ మందికి తెలుసు. అందువలన, నా దృష్టిలో తను ‘ఎక్స్‌‌‌‌ట్రార్డినరీ ఉమెన్’ అంటూ ఆమె పై పొగడ్తల వర్షం కురిపించాడు. మొత్తానికి నితిన్ కూడా పొగడ్తలు నేర్చుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:తుపానుపై అప్రమత్తంగా ఉండండి:రేవంత్ రెడ్డి

- Advertisement -