బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బి గ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 93 రోజులు పూర్తి చేసుకుంది. ప్రశాంత్ వెనకాలే తిరుగుతూ అమర్ …పబ్లిక్‌లో మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడాలి.. నేను చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నాను కదా మరి.. నువ్వు మగోడిలా మాట్లాడుతున్నావ్ అంటే నువ్వు మగోడివని అర్థంరా అని తెలిపాడు. తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత టీవీలో ప్రో కబడ్డీ ప్రోమో వేసి చూపించగా అందులో బాలయ్య కనిపించడంతో శివాజీకి మంచి ఊపు వచ్చి విజిల్స్ వేస్తూ హల్ చల్ చేశాడు.
తర్వాత బిగ్‌బాస్ కీలక ప్రకటన చేశారు. మీ అందరూ చిల్ అవడానికి ఒక పార్టీ అవసరం.. ఈ చిల్ పార్టీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు బిగ్‌బాస్ ఓ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారు.. మిమ్మల్ని చూసే ప్రేక్షకులకి మీరు నేరుగా మీ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తున్నాం అన్నారు. తర్వాత అందరినీ టీవీ ముందు కూర్చోబెట్టి అమర్ కేక్ విన్యాసాలు చూపించాడు బిగ్‌బాస్.
చిల్ పార్టీ.. అంటూ ఓ ఫన్నీ టాస్క్ పెట్టాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని వస్తువులు పెట్టి.. అందులో ఉన్న వస్తువుల్లో నుంచి ఒకటి తీసుకొని బజర్ మోగినప్పుడు పూల్‌లోకి దూకి డ్యాన్స్ చేయాలి.. ఎవరు ఆలస్యంగా దూకుతారో వాళ్లు పార్టీ నుంచి తప్పుకుంటారు.. చివరిగా దాకా ఉన్నవాళ్లే ముందుకు వెళ్తారు అని చెప్పారు. మొదలవగానే అమర్ ఔట్ కాగా తర్వాత శోభా ఔట్ అయింది. చిల్ గేమ్‌లో చివరి వరకూ ఉండి యావర్ గెలిచాడు.
తర్వాత జంపింగ్ గేమ్ పెట్టగా బిగ్‌బాస్ చెప్పిన కలర్ ప్రకారం అందరూ వెంటనే ఆ లైన్‌లోకి జంప్ చేయాలి. తప్పుగా ఎవరు చేస్తే వాళ్లు ఔట్. ఇక ఈ గేమ్‌లో యావర్‌ని సంచాలక్‌గా పెట్టాడు బిగ్‌బాస్. అందరూ రెండు కాళ్లు అవతల లైన్‌లో పెడుతుంటే అమర్ మాత్రం ఒక్క కాలే పెడుతున్నాడు. దీంతో అలా చేయొద్దని యావర్ చెప్పాడు. దీనికి అమర్ ఒప్పుకోలేదు. నేను సింగిల్ లెగ్‌యే పెడతా.. అలా పెట్టకూడదని ఏమైనా రూల్ పెట్టారా.. ఫన్నీ టాస్కుల్లో కూడా ఏంట్రా ఈ గోల అంటూ అమర్ అన్నాడు. ఈ టాస్క్‌లో ఎక్కువ మంది శోభాకి సపోర్ట్ చేయడంతో తన దత్తపుత్రికకి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. వెంటనే చేతులు జోడించి తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించింది శోభా.
Also Read:ఏపీలో కాంగ్రెస్ ప్రభావమెంత?