ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే..జాగ్రత్త!

38
- Advertisement -

నేటి రోజుల్లో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా డయాబెటిస్ బారిన పడుతుండడం కలవర పెట్టె అంశం. ఈ చక్కెరవ్యాధి కారణంగా మన శరీరం ఎన్నో రోగాలకు నిలయంగా మారుతుంది. డయాబెటిస్ అనేది ఒక రోగం కానప్పటికి ఇదొక ఆరోగ్య సమస్య. రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గుల కారణంగా చక్కెర వ్యాధి ఏర్పడుతుంది. అయితే డయాబెటిస్ ను ప్రారంభం గుర్తించడం కష్టం. అందుకే చాలమంది దీని తీవ్రత పెరిగిన తరువాత వైద్యులను సంప్రదించి మెడిసన్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే దాని నుంచి బయటపడటం అంతా సులభం కాదు. అందుకే డయాబెటిస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు..

కాగా తినే ఆహార డైట్ సక్రమంగా ఉండే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇకపోతే చాలామంది డయాబెటిస్ ను గురించలేకపోతుంటారు. అయితే శరీరంలో కొన్ని సంకేతాలు డయాబెటిస్ ను సూచిస్తాయి. ముఖ్యంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో నోరు ఎండిపోవడం, నాలుక పొడిబారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా కొందరిలో నోటి దుర్వాసన, నోటి పుండ్లు కూడా ఏర్పడుతుంటాయి. ఇంకా చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు తరచూ వేధిస్తున్న డయాబెటిస్ గా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా గాయాలు ఏర్పడినప్పుడు రక్తస్రావం ఎంతకీ ఆగకపోవడం, గాయాలు మానడంలో ఆలస్యం వంటి లక్షణాలు కనిపించిన డయాబెటిస్ కు సంకేతాలే. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి డయాబెటిస్ టెస్ట్ లు చేయించు కోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:మిగ్ జాం ఎఫెక్ట్..ఎడతెరపిలేని వర్షాలు

- Advertisement -