తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఎన్నికల ఫలితాలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు సార్లు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదలు తెలిపారు.
అయితే, ఇవాళ వెలువడిన ఫలితాలు తమను ఏమీ బాధించలేదని..కానీ అనుకున్న రీతిలో ఫలితం రాకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తాజా ఫలితాలను ఓ పాఠంగా తీసుకొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
— KTR (@KTRBRS) December 3, 2023