తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టిడిఎఫ్) అమెరికా అధ్యక్షుడిగా లక్ష్మణ్ అనుగు ఎన్నికయ్యారు. దగ్గరివాళ్లు లక్ష్మణ్ అని పిలుచుకునే అనుగు లక్ష్మినరసింహ రెడ్డి నల్గొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో పుట్టారు. ఆయన మసను చాలా పెద్దది. తండ్రి దయాగుణం ఆయనలో దాత్రుత్వాన్ని పెంచింది. అందుకే మస్కట్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ.. తెలంగాణ వలస కార్మికుల వెతలను చూసి కదిలిపోయిండు. అమెరికాలో ఉన్న.. పుట్టినగడ్డ తెలంగాణ గోసను అర్థం చేసుకున్నడు. అందుకే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వ్యవస్థాపకుల్లో ఒకరిగా.. పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలోనే భాగం పంచుకుంటున్నడు. అందుకే ఆయన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకయ్యారు.
టీడీఎఫ్-యూఎస్ఏ ఆధ్యర్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ధూం ధాం సభలు నిర్వహించి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన లక్ష్మణ్.. నల్గొండ డెవలప్మెంట్ ఫోరం బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు . మస్కట్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసిన లక్ష్మణ్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఫార్మా బిజినెస్‌లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. లక్ష్మణ్‌కి ఇద్దరు కొడుకులున్నారు.
గత సంవత్సరం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో టీడీఎఫ్-యూఎస్ఏ ఆధ్యర్యంలో నిర్వహించిన ప్రపంచ తొలి తెలంగాణ మహాసభలు నిర్వహించడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. ఆటా బోర్డ్ మెంబర్‌గా ఉన్న లక్ష్మణ్.. తెలుగు వారి కోసం కృషి చేస్తున్నారు. తెలుగు వారి గొప్పదనాన్ని, కళా వైభవాన్ని అందరికీ తెలియజేయడం, భావి తరాలకు నేర్పించడం, అలాగే తెలుగు జాతికి అండగా నిలబడి, అభ్యున్నతి కోసం కృషి చేయడం ఆటా లక్ష్యం. ‘ఆటా’లో ప్రస్తుతం ఏడు వేల మంది సభ్యులున్నారు. అమెరికాలో ఉన్న స్నేహితులు, బంధువులు మాములు సమయంలో కలుసుకోలేకపోయినప్పటికీ ‘ఆటా’లో మాత్రం తప్పక కలుస్తారు.
ఒకప్పుడు ఇండియాకు, యూఎస్‌కు మధ్య చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. దీంతోపాటు అక్కడా సమస్యలు కూడా పెరిగాయి. అమెరికాకు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు లక్ష్మణ్..