తెరాస – యు.ఎస్.ఏ జాతీయ సదస్సు..

197
- Advertisement -

తెరాస – యు.ఎస్.ఏ రెండవ జాతీయ సదస్సు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో తెరాస – యు.ఎస్.ఏ బే ఏరియా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమరులకు నివాళులు అర్పించి స్వర్గీయ జయశంకర్ మరియు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ స్వర్గీయ విద్యాసాగర్ రావుకి శ్రద్ధాంజలి ఘటించి, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి సభను ప్రారంభించారు.

స్థానిక తెరాస – యు.ఎస్.ఏ నాయకులు పూర్ణ బైరి సభకు అద్యక్షత వహించారు.వారు మాట్లాడుతూ యం.పి.కల్వకుంట్ల కవిత చేతుల మీదగా ప్రారంభం అయిన తెరాస యు.ఎస్‌.ఏ విభాగం రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ ని జరుపుకోవడం చాల సంతోషకరం అని అన్నారు. తెరాస – యు.ఎస్.ఏ వ్యవస్థాపకులు మహేష్ తన్నీరు, తెరాస ఎన్నారై విభాగాల కోర్డినేటర్ మహేష్ బిగాల, నాగేందర్ మహీపతి, రజినికాంత్ కూసానం మరియు నవీన్ కానుగంటి రూపొందించిన తెరాస – యు.ఎస్.ఏ లోగో మరియు తక్కళ్లపల్లి అరవింద్ రూపొందించిన ఫేస్ బుక్ పేజీని ఆవిష్కరించారు. భారీగా హాజరైన సభికులను ఉద్హేశించి వ్యవస్థాపకులు తన్నీరు మహేష్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ – యుఎస్‌ఏ ద్వార విస్త్రుత ప్రచారం కల్పించాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిశీలంగా పురోగమిస్తూ, వివిధ రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. అనంతరం గులాభి కండువా కప్పి పలువురు ఎన్.ఆర్.ఐ లను తెరాస అమెరికా శాఖలోకి ఆహ్వానించారు.

TRS USA National Conference in Bay Area

తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బీగాల మాట్లడుతూ ప్రస్తుతమున్న యూస్ఏ, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, డెన్మార్క్, బెహ్రెయిన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెరాస ఎన్నారై శాఖలను విస్తరించి బోతున్నాం అని తెలియ జేశారు, సామాజిక మాధ్యమాల ఆవశ్యకత గురుంచి వివరించారు. పార్టీ విస్తరణ, భవిష్యత్ ప్రణాళిక మరియు సభ్యత్వ నమోదు గురించి సూచనలు అందించారు. త్వరలో అమెరికా కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నడుము విరిగిన నేతన్న మగ్గానికి పూర్వ వైభవాన్ని తేవేడానికి చేస్తున్న ప్రయత్నానికి సంఘీభావంగా కార్యకర్తలందరు చేనేత వస్త్రలు ధరించి సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు గురించి వక్తలు చందు తాళ్ల, వెంగల్ జలగం, సక్రు నాయక్, బిందు చీడెల్ల, నరసింహ నగలవాంచ, మహేష్ పొగాకు, టోనీ జాన్, మోహన్ గోలి, కృష్ణ బొమ్మిడి తదితరులు ప్రసంగించారు. కెసిఆర్ నాయకత్వాన్ని మరియు ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలను అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాలను బలపరుస్తూ ఆమోదించారు. సభను విజయవంతగా నిర్వహించిన బే ఏరియా ప్రతినిధులు నవీన్ జలగం, భాస్కర్ మద్ది, అభిలాష్ రంగినేని, శ్రీనివాస్ పొన్నాల, శశి దొంతినేని, రుషికేశ్ రెడ్డి, యశ్వంత్, అజయ్ సాగిలను, మహేష్ తన్నీరు మరియు మహేష్ బిగాలలు అభినందించారు.

- Advertisement -