ప్చ్.. యానిమల్ పరిస్థితేమిటి?

24
- Advertisement -

రణ్ బీర్ కపూర్… కపూర్ క్యాంప్ అనబడే ఓ హీరోల ఉత్పత్తి కర్మాగారం నుంచి బయటికి వచ్చిన స్టార్ హీరో. వరుస హిట్లు కొట్టి బాలీవుడ్ లో మంచి మార్కులు సంపాదించాడు… కానీ, చాక్లెట్ బాయ్ అనే ఇమేజే రణ్ బీర్ కి ఎక్కువగా వచ్చింది. ఈ లోపు ఎవరెవరో ఫీల్డ్‌కు వచ్చేసి మాస్ మసాలా సినిమాలు తీసి మాస్ హీరోలుగా వర్దిల్లుతుంటే, కపూర్ ఫ్యామిలీ ముద్ర ఉన్న తను మాత్రం ఎందుకు ఊరుకోవాలి అనుకున్నట్టున్నాడు… ఈసారి మాస్ మసాలా కమర్షియల్ రొటీన్ టెంప్లేట్‌ను నమ్ముకున్నాడు… తెలుగు సినిమాకు బాగా అలవాటైన యాక్షన్ నేపథ్యాన్ని, నరుకుడు స్ట్రాటజీని పట్టేసుకున్నాడు… మొత్తానికి యానిమల్ అంటూ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

పైగా ‘‘నేను హీరోను కాను, నేను ఓ విలన్ని’’ అనే ఓ స్టేట్‌మెంట్ తో ఈ సినిమా చేశాడు. సినిమాలో ఇదే క్యారెక్టర్ కావొచ్చు. నిజానికి తనకు మనస్సులో ఈ సినిమాతో గొప్ప పాన్ ఇండియా హీరోగా వెలగాలనే కాంక్ష ఎక్కువగా ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిజానికీ నటనకూ పెద్ద సంబంధం ఏమీ ఉండదు. ఎలాగూ తాను మంచి నటుడిని. అందుకే, సౌత్ ను కూడా టార్గెట్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే యానిమల్ ను తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా సౌత్ టెంప్లేట్ ప్రకారమే సినిమా చేశాడు కాబట్టి, సౌత్ లో హిట్ కొట్టే ఛాన్స్ ఉంది.

కాకపోతే, యానిమల్ నుంచి వచ్చిన ప్రమోషన్ల కంటెంట్ చూస్తుంటే.. వెరీ రెగ్యులర్ గా అనిపిస్తోంది. ఎక్కడ పొరపాటున కొత్తదనం కనిపిస్తుందేమో అనే భయభక్తులతో రొటీన్ రూట్‌లోకి వెళ్లిపోయి మరీ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా తీశాడా ? అని డౌట్ కొడుతుంది. నిజానికి ఏముంది ఈ సినిమాలో..? కథను కాసేపు వదిలేయండి… సినిమాకి నిడివి విషయంలో అయినా జాగ్రత్త తీసుకోవాలి కదా, అదీ లేదు. ఇక రష్మిక ను పెట్టుకున్నారు హీరోయిన్‌గా… ఇప్పుడు ట్రెండీ హీరోయిన్ కదా… ఆమె బలం డాన్స్… ఇందులోనూ బాగానే చేసిన్నట్టు ఉంది. కానీ, ఆమె పాత్ర కూడా బలహీనంగా ఉండబోతుందని టాక్ ఉంది. ఏది ఏమైనా రేపటితో యానిమల్ భవిష్యత్తు ఏమిటో తెలుస్తోంది లేండి.

Also Read:‘డబుల్ ఇస్మార్ట్‌’…100 రోజుల్లో

- Advertisement -