రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. రాబోయే అయిదెండ్లకు భవిష్యత్ ను నిర్ణయించుకునే సమయం వచ్చింది. ఓటు అనే ఆయుధంతో సరైన పాలనకు పట్టం కడుతూ స్కామ్ లతో నిండిన ఢిల్లీ పార్టీలను తరిమికొట్టే టైమ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఆచితూచి ఓటు వేయాలని, గందరగోళానికి లోనవ్వరాదని గత పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. .
ప్రజల ఘోష పట్టించుకొని వారు నేడు ప్రజల ముందుకు వస్తున్నారు..? ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఊసే లేని నేతలు నేడు ప్రజల ముందు ఓట్లకోసం కపట ప్రేమ కనబరుస్తున్నారు.. అధికారమిస్తే రాష్ట్రాన్ని డిల్లీ దొరల కాళ్ళ దగ్గర పెట్టేందుకు గోతి కాడ నక్కలా చూస్తున్నారు.. అలాంటి వారికి ఓటుతో సరైన సమాధానం చెప్పాలని రాజకీయవాదులు ప్రజలను కోరుతున్నారు. నేడు వేసే ఓటు రాబోయే ఐదేండ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపించాలన్న.. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించాలన్న సరైన నాయకత్వం ఎంతైనా అవసరం. దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధనను డిల్లీ పాలకులతో కోట్లాడి సాధించిన ప్రజానేత కేసిఆర్.. ఆయన పాలనలో గత పదేళ్ళ కాలంగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రపథంలో దూసుకుపోతుంది.
దేశంలోనే నెంబర్ ఒన్ ఐటీ హబ్ గా హైదరాబాద్ ను నిలిపిన ఘనత కేసిఆర్ ది.. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కానీ 24 గంటల ఉచిత కరెంటును సుసాధ్యం చేసిన ఘనత కేసిఆర్ ది.. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ వృద్దిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసిఆర్ ది.. అందువల్ల గత పదేళ్ళలో కళ్ళముందు కనబడుతున్న అభివృద్దిని చూసి ఓటేయ్యాలని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న బీజేపీ ఒకవైపు, నిండా స్కామ్ లతో కూరుకుపోయి దోపిడికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంగ్రెస్ మరోవైపు.. అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతూ తెలంగాణ నినాదమే గుండె చప్పుడుగా ఉన్న బిఆర్‌ఎస్ ఇంకోవైపు.. ఇలా మూడు పార్టీల మధ్య జరుగుతున్న త్రిముఖ పోరులో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని.. తొందరపడి ఆగం కావొద్దని రాజకీయ వాదులు హెచ్చరిస్తున్నారు.
Also Read:ఓటేసిన బన్నీ,ఎన్టీఆర్,కవిత