BJP:కమలం పార్టీ రంగు బయటపడిందా?

97
- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిగా డీలా పడ్డా కమలం పార్టీ ఎంతో కొంత పరువు నిలబెట్టుకునే పనిలో ఉంది. అందుకే ఇన్నాళ్ళు తెలంగాణ పట్ల పక్షపాతం వహించిన మోడీ ఇప్పుడు కపట ప్రేమ కనబరుస్తున్నారు. ఆల్రెడీ రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన పార్టీకి జీవం పోసేందుకు నానా అగసాట్లు పడుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసిన పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. మోడీ అమిత్ షా వంటివారు ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికి పార్టీ వ్యవహారం నత్తనడకనే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని గ్రహించిన జాతీయ నేతలు చివరి అస్త్రంగా పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని చెబుతున్నారు. మోడీ ఇటీవల తన ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గింపు పై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. అయితే ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ పక్కన పెట్టిన మోడీ సర్కార్ ఎన్నికల ముందు మాత్రం వ్యాట్ తగ్గిస్తామని చెప్పడం నిజంగా వారి రాజకీయ కుయుక్తులకు నిదర్శనమని సామాన్య ప్రజలు కమలనాథులపై మండి పడుతున్నారు. బీజేపీ నేతలు ఎన్నికలు లేనప్పుడు ఒకరీతిలో ఎన్నికల సమయంలో మరో రీతిలో వ్యవహరిస్తుండడంతో వారి రాజకీయ ముసుగు ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు తెలంగాణ నిధులను ఇతర రాష్ట్రాలకు మళ్లించిన మోడీ సర్కార్ ఇప్పుడు రాష్ట్రం పై కపట ప్రమ చూపిస్తూ ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ రంగు ముందే గ్రహించిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఎన్నికల ముందు పూర్తిగా పక్కన పెట్టేసినట్లే తెలుస్తోంది. దాంతో అధికారం సంగతి అటుంచితే బీజేపీ పరువు కాపాడుకోవడం కూడా కష్టమే అనే వాదన వినిపిస్తోంది.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్:మధిరలో భట్టికి ఓటమి తప్పదా?

- Advertisement -