లేటు వయసులో ఆ హీరోయిన్ ఘాటు పెళ్లి

46
- Advertisement -

దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గరైంది నటి పూజా గాంధీ. ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. బెంగుళూరులోని ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్‌ ను నవంబర్ 29న పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూజా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బెంగాలీ అమ్మాయి అయినా పూజాకు.. విజయ్ స్వయంగా కన్నడ నేర్పించారట. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ చాలా డీప్ లవ్ లో ఉన్నారని.. ఇద్దరి మధ్య ఘాడమైన ప్రణయ గాధ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరూ పెళ్ళికి రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది.

మొత్తానికి దండుపాళ్యం హీరోయిన్‌ పెళ్లి పీటలెక్కనుంది అనగానే.. ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. బోల్డ్ భామగా భారీ ఫేమ్ తెచ్చుకున్న పూజా గాంధీ స్టార్ హీరోయిన్ గా చలామణి కాలేకపోయింది. కానీ ఈ అమ్మడు ఆ బోల్డ్ ఫేమ్ ను మాత్రం కంటిన్యూ చేస్తోంది. పూజా గాంధీ 1983లో పుట్టింది. 2001లో సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు కన్నడ, తమిళ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. ఐతే, పూజా గాంధీ కన్నడ సినీరంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా, అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరుగా గుర్తింపు సాధించింది.

అందుకే, పూజా గాంధీ గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక అవార్డులను అందుకుంది. కన్నడ సినీరంగంలో, మీడియాలో మగ హుడుగి అని పిలుస్తారు. ఆమె ఒక దశాబ్దంలో ఐదు భాషల్లో 50 పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. కానీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లితో వార్తల్లో నిలిచింది. మరి 40 ఏళ్ల వయసులో ఈ ముదురు భామ పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

Also Read:అవకాడోతో ఆరోగ్యం

- Advertisement -