” గిల్లినోల్లే జోల పడినట్లుగా.. ” మొన్నటి వరకు ధరల మోతతో సామాన్యుడిపై పెను ఆర్థిక భారం వేసిన మోడీ సర్కార్ ఇప్పుడు ప్రజలపై కపట ప్రేమ కనబరుస్తూ ఎన్నికల ముందు ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిన ధరల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ వంటి వాటితో పాటు వంట గ్యాస్ ధరలు కూడా మోత మోగించిన విషయం ప్రజలు అంతా తేలికగా మర్చిపోలేరు. కానీ ఎన్నికల ముందు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, వంట గ్యాస్ రేట్లు తగ్గిస్తామని చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు.
ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ నేతలు చేస్తున్న హామీలు ప్రజలు చీదరించుకునేలా ఉన్నాయని రాజకీయవాదులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇన్నాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులకు వాటిని అమలు చేయాలనే ఆలోచన రాలేదా ? అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.. ఇన్నాళ్ళు ధరలు పెంచుతూ పోయి సరిగ్గా ఎన్నికల ముందు వాటిని తగ్గిస్తామని హామీలు ఇవ్వడంతోనే కమలనాథుల కుయుక్తులు బయటపడుతున్నాయని అతివాదులు చెబుతున్నారు. ఇలా పూటకో మాట.. రోజుకో విధానం పేరుతో ప్రజలను మోసం చేసే పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిన విషయం.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ