కే‌సి‌ఆర్ దెబ్బకు.. ఆ ఇద్దరి ఫ్యూచర్ డైలమా?

46
- Advertisement -

తెలంగాణలో రాజకీయ వేడి తార స్థాయిలో కొనసాగుతోంది. మరో మూడు మూడు రోజుల్లో ఎలక్షన్ పోలింగ్ జరగనుండటంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. రాష్ట్ర ప్రజలు మరోసారి కే‌సి‌ఆర్ పాలనకు జై కొడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కలవరం మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన బి‌ఆర్‌ఎస్ కు తెలంగాణ ప్రజానీకం విశేష మద్దతు పలుకుతోంది. దాంతో మూడోసారి కే‌సి‌ఆర్ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈసారి కే‌సి‌ఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కే‌సి‌ఆర్ కు పోటీగా ఈసారి గజ్వేల్ లో బీజేపీ తరుపున ఈటెల రాజేందర్ మరియు కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి కూడా విధితమే. .

అయితే ఈ ఇద్దరి విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా హుజూరాబాద్ నుంచి పోటీ చేసే ఈటల రాజేందర్ బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయాల్సి వచ్చింది. ఈసారి ఈటెలకు హుజూరాబాద్ లో ఆల్రెడీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆయన ఓటమిని అంతర్గత సర్వేలు కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ ను ఢీ కొడుతూ మళ్ళీ గజ్వేల్ లో కూడా పోటీ చేయడంతో రెండు చోట్ల ఓటమి తప్పేలా లేదు.

ఫలితంగా ఆయన పొలిటికల్ కెరీర్ సందిగ్ధంలో పడిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కొడంగల్ లో దారుణంగా ఓటమిపాలు అయిన రేవంత్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఈసారి కూడా నమ్మే పరిస్థితి లేదని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ పై దృష్టి సారించకుండా మళ్ళీ కామారెడ్డిలో కూడా పోటీ చేయడంతో ఆ నియోజక వర్గంలో కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టి నిలవడం రేవంత్ రెడ్డికి ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయ్యింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొడంగల్, కామారెడ్డి రెండు చోట్ల భారీ ఓటమి తప్పేలా లేదు. మొత్తానికి ఈటల రాజేందర్ మరియు రేవంత్ రెడ్డి చేజేతులా వారి ఫ్యూచర్ ను డైలమాలోకి నెట్టేసుకున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:Bigg Boss 7 Telugu:రతిక ఎలిమినేట్

- Advertisement -