చలికాలం రానే వచ్చింది. సాధారణ రోజుల కంటే ఈ వింటర్ సీజన్ లో త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా మన శరీరంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా వింటర్ సీజన్ లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్.. వంటివి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు న్యుమోనియా బారిన పడే అవకాశం ఉంది. ఇంకా జలుబు, ఛాతీలో నొప్పి, దగ్గు, నీరసం, జ్వరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఇలా చాలా సమస్యలే చుట్టూ ముడతాయి. పెరుగుతున్న చలి కారణంగా ఉబ్బసం, కీళ్ల నొప్పులు, చర్మం పై పగుళ్లు వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే చాలా మందిలో దంత సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దంతాలు సున్నితంగా ఉంటే చల్లటి పదార్థాలు పంటికి తాకడం వల్ల సెన్సిటివిటీ సమస్య ఏర్పడుతుంది..
తద్వారా పంటినొప్పి ఏర్పడుతుంది. ఇంకా చలికాలంలో గుండె సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చలి కారణంగా రక్త ప్రసరణలో మార్పు వస్తుంది. తద్వారా హైబీపీగాని లోబీపీ గాని ఉన్నవారిలో హటాత్తుగా గుండె పోటు సంభవించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి చలికాలంలో ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్నప్పుడూ శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఉన్ని దుస్తులు దరించడం, బయట ఎక్కువగా తిరగకపోవడం.. వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇంకా ఈ వింటర్ సీజన్ లో చర్మంపై పగుళ్లు, చర్మం పొడిబారడం వంటి వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. వీటి నుంచి బయట పడేందుకు చర్మానికి కొబ్బరి నూనె రాయడం, చర్మ సంరక్షణకు బాడీ లోషన్స్ ఉపయోగించడం వంటివి చేయాలి. మొత్తానికి ఈ చలికాలంలో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:వసంత మండపంలో తులసి దామోదర పూజ