కాంగ్రెస్,బీజేపీ మధ్య చీకటి ఒప్పందం..నిజమేనా?

48
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల వేళ కొత్త కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందనే సంగతి గత కొన్నాళ్లుగా దేశ రాజకీయాల్లోనూ, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. కానీ పైకెమో బద్ద శతృత్వం కలిగిన పార్టీల లాగా కలరింగ్ ఇస్తున్నాయి. దేశంలో ఈ రెండు పార్టీలదే మెజారిటీ పాత్ర అనే సంగతి అందరికీ తెలిసిందే. దాంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ చేసిన అవినీతి అక్రమాలను కవర్ చేయడం.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ హయంలో జరిగిన అవినీతిని మరుగున పరచడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దీనికి బెస్ట్ ఉదాహరణ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే. ఇక తెలంగాణ విషయానికొస్తే… బి‌ఆర్‌ఎస్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించే బీజేపీ నేతలు కాంగ్రెస్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కానీ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు బి‌ఆర్‌ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. పైగా ఎన్నికలకు ఆర్నెళ్ళ ముందు హడావిడి చేసిన బీజేపీ ఎన్నికల ముందు సైలెంట్ కావడం.. అలాగే అప్పుడు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు హడావిడి చేస్తుండడం వంటి పరిణామాలు గమనిస్తే.. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు అంతర్లీనంగా సహాయసహకారాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయనే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా అవినీతి అక్రమాలతో నిండా మునిగిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకే తాటిపై కలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనేది కొందరి భావన.

Also Read:CM KCR:24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ రావాలి

- Advertisement -