బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని భూమి పడ్నేకర్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. గత కొన్ని రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు జాగ్రత్తగా ఉండండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా భూమి పడ్నేకర్ కి కొందరు నెటిజన్లు వరుస పోస్ట్ లు పెడుతున్నారు.
‘మా బోల్డ్ కలల రాకుమారివి నువ్వు. త్వరగా కోలుకుని తిరిగి మాకు గ్లామర్ ట్రీట్ ఇవ్వు’ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు భూమి పడ్నేకర్ కూడా సమాధానం ఇచ్చింది. ఇంతకీ భూమి ఏం మాట్లాడింది అంటే… ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. సోషల్ మీడియా వచ్చాక మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే నాకు సమయం దొరికినప్పుడు ఒంటరిగా ఉండేందుకే ప్రయత్నిస్తాను’ అని చెప్పుకొచ్చింది.
నువ్వు ఒంటరిగా ఉండేందుకే ఎందుకు ప్రయత్నిస్తున్నావ్?, ప్రస్తుతం నువ్వు ఎవరితో డేటింగ్ చేయడం లేదా ? అని ఓ తుంటరి నెటిజన్ అడిగిన ప్రశ్నకు భూమి స్పందిస్తూ.. నా డేటింగ్ నా ఇష్టం. అయినా, డేటింగ్ 24 గంటలు చేయం కదా అని చెప్పింది. అలాగే తన ఎఫైర్ల గురించి క్లారిటీ ఇస్తూ.. ‘ నాకు నా హీరోలతో ఉన్న కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా సినిమాలపైనే. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో చూడాలి” అని భూమి పడ్నేకర్ చెప్పింది.
Also Read:CM KCR:అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే