స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను వివాదాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మన్సూర్ అలీఖాన్ మాటలను ఖండిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు Xలో ‘వి స్టాండ్ విత్ త్రిష’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక త్రిషపై మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ మద్దతుగా నిలిచారు. ‘త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటులేదు.
నితిన్ ఇంకా తన ట్వీట్ లో పోస్ట్ చేస్తూ.. ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను’ అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. అలాగే త్రిషకు మంత్రి రోజా కూడా అండగా నిలిచింది. మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్ లాంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి మారాలంటే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదన్నారు. లేదంటే మగాళ్లు ఇలాగే మాట్లాడతారని అన్నారు. మహిళలమైన మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేసినా రాజకీయాల్లో, సినిమాల్లో ఎదిగి చూపించామని మంత్రి రోజా అన్నారు
ఇంతకీ, నటుడు మన్సూర్ అలీఖాన్ ఏం కామెంట్స్ చేశాడు అంటే.. నేను లియో సినిమాలో కీలక పాత్రలో నటించాను. ఐతే, హీరోయిన్ త్రిషను రేప్ చేసే సన్నివేశం నాకు లేకపోవడంతో చాలా బాధపడ్డాను అంటూ మన్సూర్ అలీఖాన్ మాట్లాడాడు. అసలు మన్సూర్ అలీఖాన్ ఇలా కామెంట్స్ చేయడానికి ముఖ్య కారణం.. గతంలో అతను నటించిన చాలా చిత్రాల్లో అతను ఎన్నో రేప్ సన్నివేశాల్లో నటించాడు. అందుకే, అతను త్రిష పై అలా కామెంట్స్ చేశాడు.
Also Read:Revanth:రేవంత్ రెడ్డి కాదు ఊసరవెల్లి!