దేశంలో జమిలి ఎలక్షన్స్ కన్ఫర్మ్?

55
- Advertisement -

దేశంలో జమిలి ఎలక్షన్స్ పై గత కొన్నాళ్లుగా అడపా దడపా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్క అడుగు ముందుకేసి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ మధ్య నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎలక్షన్స్ పై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని భావించారంతా. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తప్ప వేరే విషయాలను ప్రస్తావించలేదు. దీంతో జమిలి ఎలక్షన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు వాదన వినిపించింది. అయితే అంతర్గతంగా జమిలి ఎలక్షన్స్ పై మోడీ సర్కార్ కసరత్తులు జరుపుతూనే ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. .

తాజాగా జమిలి ఎలక్షన్స్ నిర్వహణ పై మాజీ రాష్ట్రపతి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్ పర్సన్ రామ్ నాథ్ కోవింద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. జమిలి ఎలక్షన్ నిర్వహణకు దేశంలో గుర్తింపు పొందిన పార్టీలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఇప్పటివరకు తాను సంప్రదించిన పార్టీలన్ని సుముఖత తెలిపాయని ఆయన చెప్పుకొచ్చారు. అన్నీ పార్టీలు కూడా నిర్మాణాత్మకంగా మద్దతు ప్రకటిస్తే జమిలి ఎలక్షన్స్ రూపకల్పన జరిగే అవకాశాలు అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికలను జమిలి ఎలక్షన్స్ గా మార్చే అవకాశం ఉందా ? లేదా ఇంకా ఏమైనా ఇతరత్రా ప్రణాళికలకు మోడీ సర్కార్ శ్రీకారం చూడుతుందా అనేది చూడాలి.

Also Read:

ఈ ఇద్దరు 2027 వరల్డ్ కప్‌ లో కష్టమే?

- Advertisement -