యాంకర్ ఝాన్సీ సినిమా నటి, టెలివిజన్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఎందుకో ఆమె టాలెంట్ కి తగ్గట్టు, ఆమెకు అవకాశాలు రావడం లేదు. అటు పర్సనల్ లైఫ్ లోనూ ఝాన్సీ ఎన్నో ఇబ్బందులు పడి, వాటి నుంచి బయట పడింది. ఐతే, ఝాన్సీ తన లైఫ్ లో ఎదురుకున్న కష్టాలు, చూసిన నష్టాల గురించి కూడా ఏకరవు పెట్టింది. గతంలో తాను ఆనందంగా లేనని, ఎక్కువ బాధలు పడ్డాను అని చెపుకొచ్చింది. తన కూతుర్ని ప్రాణంగా చూసుకుంటూ, కెరీర్ ని కాపాడుకుంటూ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడంలోనే తన జీవితం గడిచిపోతుంది అని ఝాన్సీ చెప్పింది.
కానీ, ఇటీవల తనను రెండో పెళ్లి చేసుకోమని తనను కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నారని, తన స్నేహితులు కూడా పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారని ఝాన్సీ తెలిపింది. కాకపోతే, తన మొదటి భర్త వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డాను అని, అందుకే మళ్లీ పెళ్లి పై తనకు అసలు ఆసక్తి లేదు అని, ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఆ వచ్చే వ్యక్తికి సర్దుకుపోయే తత్త్వం ఉండాలని.. అలాగే ఆర్థికంగానూ ఉన్నత స్థితిలో ఉండాలని, అప్పుడే తన జీవితాన్ని అతనితో పంచుకోవడానికి అన్నీ రకాలుగా బాగుంటుందని, అలాంటి వ్యక్తి దొరికితేనే తాను మళ్లీ పెళ్లి చేసుకుంటాను అని ఝాన్సీ చెప్పింది.
ఈ సందర్భంగా ఝాన్సీ ఇంకా మాట్లాడుతూ.. ‘పెళ్లి అనేది మనిషికి బలం కావాలి, బలహీనత అవ్వకూడదు. నేను నా లైఫ్ లో కష్టాలతో పాటు మోసాలూ కూడా ఎక్కువే చూశాను. నన్ను డబ్బు పరంగా, ఇతర విషయాల పరంగా చాలా మోసం చేశారు. నేను సంపాదించిన దాంట్లో బోలెడంత డబ్బు అలానే పోయింది. అందుకే, రెండో పెళ్లి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోలేక్పోతున్నా’ అంటూ మొత్తానికి ఝాన్సీ చాలా ఎమోషనల్ అయ్యింది.
Also Read:పిక్ టాక్ : గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొట్టింది

