బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకుంది. ఎవిక్షన్ పాస్ విషయంలో సంచాలక్‌గా ఉన్న శోభాశెట్టి నిర్ణయాన్ని తప్పుపడుతూ చెలరేగిపోయారు శివాజీ. దీంతో ఆవేశంలో ఉన్న శివాజీ.. యావర్ దగ్గరకు వెళ్లి.. శోభాశెట్టి ఎప్పుడు సంచాలక్‌గా ఉన్నా ఫేవరిజమ్‌గానే నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. బాల్స్ కింద పడిన దాన్ని బట్టి మన నిర్ణయం చెప్పేద్దాం అని ప్రశాంత్ చెప్పగా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ప్రశాంత్‌పై మండిపడింది శోభా.
అయితే చివరగా ఎవిక్షన్ పాస్ విన్నర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ నుంచి అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రశాంత్ నిర్ణయం మేరకు అయిష్టంగానే యావర్‌ని విన్నర్‌గా ప్రకటించింది శోభా. తన చేతుల మీదుగానే యావర్‌కి ఎవిక్షన్ పాస్‌ని అందించింది. నువ్వు సంచాలక్‌గా ఉన్న ప్రతిసారీ.. గొడవలు అయ్యాయి.. డిస్కషన్స్ నడిచాయి.. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది అని శోభాతో చెప్పాడు శివాజీ. నాకు సారీ చెప్పొద్దు.. అన్నీ తెలిసిన మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని శోభా అంటే.. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నువ్వు సంచాలక్‌గా చేసిన ప్రతిసారి ఇబ్బంది పడ్డాం అని తెలిపాడు శివాజీ. అయితే ఈ క్రమంలో శివాజీ ప్రవర్తించిన తీరు మాత్రం చాలా దారుణం.
ఇక అంతా శోభాని టార్గెట్ చేయగా బాత్ రూంలోకి వెళ్లి శోభా బాధపడుతుంటే అర్జున్ వెళ్లి ఓదార్చాడు. శివాజీ అన్న గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే…. ఒక మాట చెప్తాడా.. దానికి పాజిటివ్ సైడ్ ఉంటుందీ.. నెగిటివ్ సైడ్ ఉంటుంది.. సందర్భాన్ని బట్టి ఎటైనా జంప్ చేసేస్తాడని చెప్పాడు. కాబట్టి నువ్వు తప్పో రైటో నిర్ణయం నాది అని అని ఉంటే సరిపోయేదని చెప్పాడు. ప్రశాంత్ దగ్గర కూర్చున్న శివాజీ.. ఏరా.. నన్ను గేమ్ నుంచి తీసేశారని అరిచానని అనుకున్నారా? అని అడిగాడు. లేదన్నా అని ప్రశాంత్ అనడంతో అయితే ఓకే.. నాకు ఆ మాట రాకూడదని చెప్పాడు.
Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?
తర్వాత శోభాశెట్టిని పిలిచి నేను గెలవలేదని ఫైట్ చేశానని అనుకున్నావా?.. అదేం లేదుగా అని అడిగాడు శివాజీ. అంతేకదా అని శోభా అని అనడంతో అప్పుడు శివాజీ… థూ అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.తర్వాత అర్జున్ పక్కన కూర్చుని.. నేను నా గురించి ఫైట్ చేయలేదురా.. అయినా ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ నాకెందుకు? ఒకవేళ నాకు వస్తే…నాకోసం ఉపయోగించుకోను.. యావర్‌కో.. ప్రశాంత్ గాడికో ఉపయోగించేవాడిని అని చెప్పేశాడు.. నేను ఎలాగూ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ కాను.. అలాంటప్పుడు నాకెందుకు? అని అన్నారు శివాజీ. మొత్తంగా శివాజీ చూపించిన అన్ని షేడ్స్‌తో ప్రేక్షకులు సైతం ఖంగుతిన్నారు.