బీజేపీకి మోడీ కూడా..నో యూజ్?

31
- Advertisement -

గతంలో రాష్ట్రం ముఖం ఎప్పుడు చూడని ప్రధాని ఈ మధ్య తరచూ రాష్ట్రానికి వస్తున్నారు ? గతంలో తెలంగాణ అభివృద్ధి గురించి ఎప్పుడు ఆలోచించని మోడీ ? ఇప్పుడు రాష్ట్రానికి తామే దిక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు..? ప్రధాని మోడీ వేస్తున్న జిమ్మిక్కులు ఎలక్షన్ స్టంట్స్ అనే సంగతి తెలియంది కాదు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రానికి అరకొరగా రావడం తప్ప.. తెలంగాణ స్థితిగతులను పర్వవేక్షించని ప్రధాని ఈ ఒక్క నెలలోనే ఐదుసార్లు రాష్ట్రానికి ముఖం వేశారంటే.. ఓటర్లను ఆకర్శించేందుకు ఆయన ఎన్ని ఎత్తులు వేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఈ నెల 7 న బీసీ బహిరంగ సభకు హాజరైన ప్రధాని, 11 నా ఎస్సీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఇక ఇదే నెల 25, 26, 27 తేదీల్లో రోడ్ షో లో కూడా పాల్గొననున్నారు.

కాగా ఎన్నికల మూడు మోడీ ఈ స్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టడంతో సామాన్యులు విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. ఇన్నాళ్ళు రాష్ట్రం గుర్తు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ.. రాష్ట్రాభివృద్దిపై పక్షపాతం చూపే మోడీ.. ఇప్పుడేమో కపట ప్రేమ చూపిస్తున్నారని సామాన్యులు సైతం వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. బీసీ, ఎస్సీలను గతంలో ఏ మాత్రం పట్టించుకోని ప్రధాని మోడీ ఇప్పుడేమో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు కమిటీలు వేస్తామని కల్లబొల్లి హామీలు ఇస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసిన మోడీ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని అందరికీ తెలిసిన విషయమే. ఇక అసలే తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే ఉండగా.. పార్టీలోని ఇతర నేతలు సైతం యాక్టివ్ గా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మోడీ ద్వారా పార్టీకి మైలేజ్ పెంచే ఆలోచనలో కమలనాథులు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రజలు ప్రధాని మాటలను లైట్ తీసుకుంటున్న పరిస్థితి. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసిన బీజేపీ బలపడడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ అతివాదులు చెబుతున్నారు.

Also Read:Saindhav:‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్

- Advertisement -