ఎన్టీఆర్‌కి పోటీగా బాలయ్య

9
- Advertisement -

డైరెక్టర్​ అనిల్​ రావిపూడి, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్​లో తెరకెక్కి.. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై బాక్సాఫీస్​ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది ‘భగవంత్​ కేసరి’. 21 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.68.52 కోట్ల షేర్‌, రూ.140 కోట్ల గ్రాస్‌ వసూల్ చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ‘భగవంత్​ కేసరి’కి ప్రపంచ వ్యాప్తంగా రూ.67.35 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి బాలయ్య చాలా గ్యాప్ తర్వాత భారీ హిట్ కొట్టాడు. దీంతో బాలయ్య కొత్త సినిమా పై హైప్ పెరిగింది.

ప్రస్తుతం బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. బాబీ, బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క‌థ రెడీ చేశాడు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే యాక్షన్ సినిమా అట. అంటే.. యాక్షన్ కన్నా.. ఫ్యామిలీ ఎమోషన్సే సినిమాలో ఎక్కువ ఉంటాయట. అన్నట్టు ఈ సినిమాతో ఎన్టీఆర్‌‌కు పోటీగా బాలయ్య బరిలోకి దిగబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలతో ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలకు సిద్దమవుతోంది.

బాలకృష్ణ 109 చిత్రం, బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా 2024 మార్చి 29న విడుదల కానుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వచ్చే వేసవిలో బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు ఒకే సారి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. మరి అబ్బాయ్ – బాబాయ్ లలో బాక్సాఫీస్ దగ్గర ఎవరు నెగ్గుతారో చూడాలి. ప్రస్తుతానికి అయితే బాలయ్య – ఎన్టీఆర్ మధ్య పెద్దగా మాటలు కూడా లేవు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటం విశేషం.

Also Read:ఎలక్షన్ ఫైట్.. వారసుల పోరు?

- Advertisement -