ఎలక్షన్ ఫైట్.. వారసుల పోరు?

66
- Advertisement -

ఈ నెల 30 న తెలంగాణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. పార్టీల్లోని నేతలందరూ వాడి వేడి విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వారసుల హవా గట్టిగా కనిపించే అవకాశం ఉంది. అధికార బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ బీజేపీ పార్టీల తరుపున ఆయా నేతల వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో కొత్త నేతలకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. కంటోన్మెంట్ నుంచి అధికార బి‌ఆర్‌ఎస్ తరుపున ఎమ్మెల్యే సాయన్న బిడ్డ లాస్య పోటీలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేయనున్నారు.

దీంతో ఈసారి కంటోన్మెంట్ బరిలో ఇద్దరు సాధారణ మహిళా నేతల మద్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోరుట్ల నుంచి బి‌ఆర్‌ఎస్ నేత విద్యాసాగర్ బరిలో ఉన్నారు. అలాగే నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ తరఫున జానారెడ్డి తనయుడు జయవీర్, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ ( బీజేపీ ), నాగర్ కర్నూల్ నుంచి దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ ( కాంగ్రెస్ ), వంటి వారు బరిలో ఉన్నారు. ఇంకా మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రెడ్డి ( కాంగ్రెస్ ) కూడా పోటీ చేయబోతున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో ఈసారి వారసులే బరిలో నిలవబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో యువ నేతల మద్య గట్టి పోటీ వాతావరణం కనిపిస్తోంది. మరి ఎవరు ఎవరిపై పై చేయి సాధించి రాజకీయంగా ముందుకు సాగుతారో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:యావర్‌కి బూస్ట్ ఇచ్చిన సుజా అహ్మద్

- Advertisement -