TTD:విజ్ఞాన‌ భాండాగారాలు తాళపత్ర గ్రంథాలు

35
- Advertisement -

మన పూర్వీకులు మనకు అందించిన అపురూప విజ్ఞాన‌ భాండాగారాలైన‌ తాళపత్ర గ్రంథాలను డిజిటైజ్ చేసి భావితరాలకు అందించాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని అధికారులకు ఆయన సూచించారు.మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రగతిపై బుధ‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో త‌మ కార్యాల‌యంలో ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప‌కుల‌ప‌తుల‌తో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సాహిత్య‌, శాస్త్ర‌, సాంకేతిక త‌దిత‌ర అనేక అంశాల‌పై మ‌న పూర్వీకులు తాళ‌ప‌త్ర గ్రంథాల‌లో లిఖించార‌ని అన్నారు. చాల‌ సంవత్సరాల క్రితం టీటీడీ విలువైన తాళపత్ర గ్రంథాలను ఎస్వీ ప్రాచ్ఛ‌ పరిశోధన సంస్థ (ఓఆర్ఐ) కి ఇచ్చిన‌ట్లు తెలిపారు. మ్యాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు ద్వారా అనేక‌ విలువైన తాళపత్ర గ్రంథాలను డిజిటైజ్ చేయడానికి ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పర‌స్ప‌ర‌ సహకారంతో ప‌ని చేయాల‌న్నారు. ఇందుకు అవసరమైన స్కానర్లను టీటీడీ స‌మ‌కురుస్తుంద‌న్నారు. ఓఆర్ఐ నుండి వచ్చిన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసిన త‌రువాత తాళ‌ప‌త్రాల‌ను మరియు డిజిటలైజ్ కాపీలను తిరిగి వారికి అందిస్తామన్నారు. డిజిటలైజ్‌ చేసిన సమాచారాన్ని టీటీడీ పుస్తక రూపంలో ముద్రించి పాఠ‌కుల‌కు అందిస్తుంద‌ని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్వీయూనివ‌ర్శిటీ విసి డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Also Read:ధరణి రద్దయితే.. దళారులదే రాజ్యం!

- Advertisement -