కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చేశారని కిషన్ రెడ్డి మాట్లాడటాన్ని తప్పుబట్టారు కవిత. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆమె.. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందన్నారు.
కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని అది ప్రజలందరికి తెలుసు అన్నారు.
Telangana’s peak demand is 15500 MWs, this NTPC plant gives 680 MWs to Telangana.
Essentially that accounts to only 4% of power that Telangana utilises. @kishanreddybjp Anna … kindly stop spreading lies about how uninterrupted power is given by Central Government.
It is the… https://t.co/M4kP42JVOy
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 7, 2023