రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. వేములవాడ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..నవంబర్ 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతోందన్నారు. విరాట్ కోహ్లీ సెంచరి కొట్టినట్టు కేసీఆర్ సెంచరీ కొట్టి వంద సీట్లతో తప్పకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసుడు కూడా ఖాయం అన్నారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అన్నారు. సెంటిమెంట్లకు, ఆయిట్‌మెంట్లకు పడిపోవద్దని… మూడుసార్లు ఓడిపోయాను దండం పెడుతా అంటే పడిపోకండి. కులం కూడు పెట్టదు… సెంటిమెంట్‌తో ఏమీ కాదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
తెలంగాణను ఎవరూ నడపాలనేది మోదీ, రాహుల్ కాదు డిసైడ్ చేయాల్సింది.. తెలంగాణ గల్లీ డిసైడ్ చేయాలి. ఢిల్లీ కాదు. మళ్లా ఢిల్లీకి మన జుట్టు ఇస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి దిగుతడు ఆలోచించాలన్నారు. వేములవాడలో పోటీ చేస్తున్నది లక్ష్మీనరసింహారావు కాదు కేసీఆర్ అనుకోవాలన్నారు. వేములవాడకు ఇండస్ట్రీలు తేవాలి అన్నారు… మంచి మెజార్టీతో గెలిపించండి. మీ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను అన్నారు.
Also Read:HCAలో అవినీతి..అజార్‌కు షాక్