CM KCR:బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజలకోసం

34
- Advertisement -

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు సీఎం కేసీఆర్. కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..భద్రాద్రి సీతారామచంద్రమూర్తి కొలువుదీరిన ఈ నేలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఆ శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగానే భద్రాద్రి జిల్లాను చేసుకున్నామన్నారు.ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎన్నికలు వస్తాయి…పోతాయి కానీ ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో ఆలోంచాలన్నారు. నాయకులు గెలవడం కాదు ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి సరికొత్త అర్ధం అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తితో పాటు ఆయన వెనకున్న పార్టీని చూసి ఓటేయాలన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి చెల్లించని కారణంగా మన గనులు మనకే ఉండేవన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లామన్నారు. సింగరేణిని మొదటి అడుగులోనే విజయం సాధించామన్నారు. సింగరేణి లాభాలను పెంచామని ఈసారి కార్మికులకు దసరా బోనస్ రూ.700 కోట్లు ఇచ్చామన్నారు.

సింగరేణిలో కారుణ్య నియమాకాలను పొడగొట్టిందే కాంగ్రెస్,సీపీఐ,సీపీఎం యూనియన్లు అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాకే కొత్తగూడెం జిల్లా అయిందని, మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. పొడు భూములకు పట్టాలిచ్చి వారిని ఆదుకున్నామన్నారు.భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తయిందని త్వరలోనే దానిని ప్రారంభిస్తామన్నారు. రైతు బంధు, దళిత బంధుతో వెలుగులు నింపుతున్నామన్నారు. దళితుల గురించి 75 సంవత్సరాల్లో ఆలోచించిన నాయకుడే లేడన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి కొనసాగాలంటే బీఆర్ఎస్‌కే మరోసారి పట్టం కట్టాలన్నారు. తెలంగాణ రాకముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Also Read:కాంగ్రెస్ తో ఢీ.. కామ్రేడ్ల దెబ్బ!

- Advertisement -