అధికారం కోసం అడ్డదారులు తొక్కడం కాంగ్రెస్ కు కొత్తేమి కాదు.. మొదటి నుంచి కూడా ఇదే వైఖరినే కొనసాగిస్తోంది ఆ పార్టీ. కుట్రలు, కుతంత్రాలను ఆయుధంగా చేసుకొని దోపిడికి కేరాఫ్ అడ్రస్ గా మారిన హస్తం పార్టీని దేశ ప్రజలు గట్టిగానే తిరస్కరించారు. దీంతో గత పదేళ్ళలో కాంగ్రెస్ పాతాళానికి పడిపోయింది. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీలోని కొంతమంది నేతలు చేస్తున్న ప్లాన్స్.. కాంగ్రెస్ పై నమ్మకాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నాయి. అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ మోస్ట్ డెవలప్ మెంట్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. .
కేసిఆర్ పాలన దక్షిత మరియు ఐటీ మినిస్టర్ గా కేసిఆర్ విదేశీ సంస్థలను ఆకర్షిస్తున్న తీరుతో.. పెద్ద ఎత్తున హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. దాంతో ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్దిని జీర్ణించుకోలేని కొంతమంది కుళ్ళు రాజకీయ నాయకులు హైదరాబాద్ లోని విదేశీ కంపెనీలకు ఎరవేస్తూ వారి రాష్ట్రానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ కుట్రపూరితమైన రాజకీయం ఎవరిదో కాదు కర్నాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ దే. హైదరబాద్ లోని చాలా పెట్టుబడి సంస్థలను బెంగళూరు కు తరలించేందుకు డీకే కుట్రపూరితంగా విదేశీ సంస్థలకు ఎర వేస్తున్నట్లు ఆ రాష్ట్ర మీడియానే కొడై కుస్తోంది. మరి తెలంగాణ అభివృద్దిని ఓర్వలేని నాయకుడిని టి కాంగ్రెస్ నెత్తిన పెట్టుకోవడం గమనార్హం. డీకే వ్యూహాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాయో లేదో గాని రాష్ట్రాన్ని మాత్రం అధోగతి పలు వస్తాయనడానికి ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యూహలే నిదర్శనం. దీన్నిబట్టి చూస్తే డీకే సలహాలతో ముందుకు సాగుతున్న టి కాంగ్రెస్ కు అధికారమిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:కాంగ్రెస్ కు పెద్ద పరీక్షే ఇది?