బిడీ కార్మికులకు రూ. 5 వేల పెన్షన్ అందిస్తామన్నారు సీఎం కేసీఆర్. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…యువకుడు సంజయ్‌ని గెలిపించాలన్నారు. బిడీ కార్మికులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొత్తగా బిడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామని…దానిని రూ.5 వేల వరకు పెంచుకుంటూ పోతామన్నారు.
దేశ రాజజీయాల్లో పరిణతి రావడం లేదని…అభ్యర్థితో పాటు వెనుకున్న పార్టీని చూడాలన్నారు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగం అయితదన్నారు. దళితబందు పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని..
ఎక్కడా లేని పథకాలు ఇస్తున్నాం అన్నారు. ధరణి తీసేస్తే రైతుబందు, రైతు బీమా డబ్బులు ఎట్లా వస్తాయని..పహాణీ నకళ్ళు, విఆర్వో, ఎమ్మార్వో లు వస్తారు.. వసూళ్లు చేస్తారన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
సమైక్య పాలనలో నేతన్నల ఆత్మహత్యలు తనని కలిచివేశాయన్నారు. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్ధీరికరణ చేయాలని నిర్ణయించామని అందుకే రైతు బంధు తీసుకొచ్చామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని…అదే మన తలరాతను మారుస్తుందన్నారు.పేదల సంక్షేమం కోసం పెన్షన్లు తెచ్చిందే బీఆర్ఎస్ అన్నారు.సంజయ్‌ని ప్రజలంతా పెద్ద మనసుతో ఆశీర్వదించి దీవించాలని కోరారు.
Also Read:కోనాయిపల్లికి సీఎం కేసిఆర్