తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన హరీష్…మొన్న మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి వస్తే మీటింగ్ లో జనం లేర అన్నారు. అన్ని సర్వేలు హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటున్నాయని….జగ్గారెడ్డి గెలిచాడు తప్ప, 5 ఎల్లలో ఒక్కనాడు ఊళ్ళలకు రాలేదన్నారు. ఆయన పత్తా తెల్వదు, ఫోన్ నంబర్ తెల్వదన్నారు. గల్లికో ఏటీఎమ్ పెడతా అన్నడు. ఎన్నో ఇల్లు ఇస్తా అన్నడు ఒక్కటన్న జరిగిందా ఆలోచించాలన్నారు. అందరం కలిసి కార్యరంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కొట్టుక పోతాడన్నారు. చింతా ప్రభాకర్ గెలవకున్నా, ప్రజల మధ్య ఉన్నడు. ఎంతో సేవ చేశారన్నారు
కేసీఆర్ 570 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. నర్సింగ్ కాలేజీ ఇచ్చారన్నారు. జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి. తెలంగాణ వద్దు అన్నడు. కర్ణాటకలో కలుపుతా అన్నడు ఆలోచించాలన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలిపిన వ్యక్తి జగ్గారెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ తో బిజెపి చేతులు కలిపితే, షర్మిల కాంగ్రెస్ తో చేతులు కలిపిందట…పవన్ కళ్యాణ్ తెలంగాణ రావడం ఇష్టం లేదు అని భోజనం మానేసిండు నిజమా కాదా ఆలోచించాలన్నారు. తెలంగాణ ఇవ్వాలంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సిగరెట్టా, బీడీనా అన్నడు. బతికి ఉండగా తెలంగాణ రానే రాదు అన్నడు. తెలంగాణ వ్యతిరేకించింది షర్మిల ఆలోచించాలన్నారు.
Also Read:KCR:తెలంగాణలో శాశ్వతంగా కరెంట్ సమస్య ఉండదు
వీరికి చంద్రబాబు లోపలి నుండి మద్దతు ఇస్తాడట….అలాంటి వాళ్ళతో నేడు బిజెపి, కాంగ్రెస్ చేతులు కల్పిందన్నారు. తెలంగాణను దెబ్బ తీయడానికి తెలంగాణ ద్రోహులు అంతా ఒక్కటవుతున్నరని..కాంగ్రెస్ ముసుగులో బిజెపి ముసుగులో వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అన్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి….జై తెలంగాణ అన్న వల్ల మీదికి తుపాకి పట్టుకొని బయలుదేరాడన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా వెళ్లిపోయాడని…ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, నికార్సైన తెలంగాణ బిడ్డ కేసీఆర్ కు మధ్య పోటీ అన్నారు. చింతా ప్రభాకర్ ను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు హరీశ్ రావు.