- Advertisement -
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టించింది. బుధవారం సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆవిష్కరించనున్నారు.
సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో వాంఖెడేతో అతడికున్న అనుబంధానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసీఏ వెల్లడించింది. ప్రస్తుతం విగ్రహానికి సంబంధించిన పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో బుధవారం విగ్రహావిష్కరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లీ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన పదేళ్ల తర్వాత ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Also Read:హార్రర్ థ్రిల్లర్.. ‘హి’
- Advertisement -