శ్రీలంకపై అఫ్గాన్‌ ఘనవిజయం

53
- Advertisement -

ప్రపంచకప్‌లో అద్వితీయ ప్రదర్శనతో దూసుకుపోతోంది ఆఫ్ఘానిస్తాన్. గత ప్రపంచకప్‌లలో ఎప్పుడూ గెలవని విధంగా ఈ సారి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది ఆప్ఘాన్. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి విజయం సాధించింది. అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ (73),షాహిది(58) నాటౌట్‌తో రాణించగా రహ్మత్‌ షా (62) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇక అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాథుమ్‌ నిషాంక (46), కుషాల్‌ మెండిస్‌ (39), సదీర సమరవిక్రమ (36) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫజల్‌ హక్‌ 4 వికెట్లు తీయగా ముజీబ్‌ రెండు వికెట్లు తీశాడు. ఫజల్‌హక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:మరింత ఆకట్టుకునే ..’మా ఊరి పొలిమేర 2′

- Advertisement -