KCR:10 కోట్లతో బీసీ భవన్

25
- Advertisement -

కోదాడలో మల్లయ్య యాదవ్‌ని బంపర్ మెజార్టీతో గెలిపిస్తే రూ.10 కోట్లతో బీసీ భవన్‌ని కట్టించే బాధ్యత తనదన్నారు సీఎం కేసీఆర్. బీసీ చైతన్యాన్ని చూపించాలి.. చూపిస్తారనే నమ్మకం నమ్మకం ఉందన్నారు.కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం..కోదాడలో ఒక బీసీకి అవకాశం రాలేదు. పీహెచ్‌డీ వరకు చదివిన విద్యావంతుడని పిలిచి టికెట్‌ ఇచ్చాను అన్నారు.

మల్లయ్య యాదవ్‌ గెలువడు అని ఆరు నెలలుగా నా వద్దకు వచ్చి గునుగుడు.. మంత్రి వద్దకు వచ్చి గునుడు. గెలవకపోతే గెలువకపాయే.. నేను టికెట్‌ ఇస్తా.. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పాను అన్నారు. 60శాతం, 70శాతం బీసీ సామాజిక, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపావాలన్నారు.

ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉందని… కోదాడలో విజయ బావుటగా ఎగుర వేయాలి. మల్లయ్య యాదవ్‌ ఇప్పుడే నన్ను కోరారు. అగ్రకులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలు ఉన్నరు. ప్రత్యేకంగా కోదాడ కోసం బీసీ భవన్‌ను మంజూరు చేయాలని కోరారు. మల్లయ్య యాదవ్‌ను బంపర్‌ మెజారిటీతో గెలిపిస్తే రూ.10కోట్లతో కోదాడలో బీసీ భవన్‌ను కట్టించే బాధ్యత తనదన్నారు.

Also Read:సందీప్ కిషన్…ఊరు పేరు భైరవకోన

- Advertisement -