- Advertisement -
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జల్లాలోని శాస్త్రినగర్లో గల క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు.
రైతుబంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగే ప్రభుత్వం యాసంగి పంట సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుందని తెలిపారు.
రైతుబంధును ఆపాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి అని కోరారు. రైతాంగానికి నష్టం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
Also Read:ప్చ్.. రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్ !
- Advertisement -