ప్చ్.. పాపం నిర్మాతలు

48
- Advertisement -

ఇప్పుడంతా పాన్ ఇండియా మాత్రమే సౌత్ సినీ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తోంది. టాలెంట్ ఉన్న దర్శకులకు ఇది సువర్ణావకాశమే. ఇది వ‌ర‌కు హిట్ ద‌ర్శ‌కులకు వారి మార్కెట్ కంటే కూడా కాస్త ఎక్కువ పారితోషికాలు ఇచ్చేవారు. సదరు దర్శకుడు మనసు పెట్టి సినిమా తీయాలని, అందుకోసం నాలుగు రూపాయిలు ఎక్కువ ఇవ్వడంలో తప్పు లేదు అని లేంజడరీ నిర్మాత రామానాయుడు కూడా ఎప్పుడు చెబుతూ ఉండేవారు. కానీ, ఆ తర్వాత దర్శకుల రేంజ్ మారిపోయింది. రాజమౌళి లాంటి వారు ఏకంగా `వాటా`లు కూడా అందుకొన్నారు.

ఐతే, ఇప్పుడు ఏకంగా ప్యాకేజీల్లోకి దిగిపోయారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ కూడా రాజమౌళినే. బాహుబలి సిరీస్ తర్వాత, ఆర్ఆర్ఆర్ రూపంలో ఆయన ప్యాకేజీ తీసుకున్నారు. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు కెజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ కి అయన కూడా ఫ్యాకేజీ పుచ్చుకుంటున్నాడు. ఇక జ‌వాన్ తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు అట్లీ. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే ఇది మ‌ర్చిపోలేని బ్లాక్ బ‌స్ట‌ర్‌ ఇచ్చాడు. కాబట్టి, తన తర్వాత సినిమాకు తనకు ప్యాకేజీ కావాలని అట్లీ డిమాండ్ చేస్తున్నాడు. కెరీర్ లో ప్లాప్ లు లేకపోవడం అట్లీకి ఉన్న అడ్వాంటేజ్.

ఐతే, రాజమౌళి, ప్రశాంత్ నీల్, అట్లీ ల పేరు చెప్పుకుని.. మిగిలిన దర్శకులు కూడా ప్యాకేజీలు కావాలని అడుగుతున్నారు. విజయ్ తో లియో తీసిన లోకేష్ కనగరాజ్ కూడా తానూ సినిమా చేయాలంటే ప్యాకేజీ కింద రూ.100 కోట్లు ఇవ్వాల‌న్న‌ది ష‌ర‌తు పెడుతున్నాడు. ఇందులో త‌న పారితోషికంతో స‌హా.. మిగిలిన టెక్నీషియ‌న్లు, మిగిలిన న‌టీన‌టుల‌ పారితోషికాలు అన్నీ ఉంటాయట. హీరో పారితోషికం మాత్రం నిర్మాతే ఇచ్చుకోవాలి. ఎంత పేరున్న టెక్నీషియ‌న్ల‌యినా వాళ్ల పారితోషికాలు.. రూ.50 కోట్ల లోపే ఉంటాయి. మిగిలిన 50 కోట్లూ లోకేష్ కానగరాజ్ కి జ‌మ అన్న‌మాట‌. ఇదే బాటలో మిగిలిన హిట్ దర్శకులు కూడా సాగితే ఏమిటి పరిస్థితి ?, ప్చ్.. పాపం నిర్మాతలు.

Also Read:పిక్ టాక్ : వామ్మో ఇది అందాల అరాచకం

- Advertisement -