‘భూమి పెడ్నేకర్’ ఇప్పుడు హిందీ వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయింది. బోల్డ్ బెడ్ సీన్లు చేయడంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని ఈ భామ ఇప్పుడు ముంబైలో హాట్ హాట్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఐతే కెరీర్ ప్రారంభంలో మాత్రం తన శరీర రంగు గురించి ఎక్కువగా కామెంట్స్ వినిపించాయి అని చెప్తోంది. అప్పుడు తనను బాగా చులకనగా మాట్లాడేవారు. కానీ, టాలెంట్ ని మాత్రమే చూసే కొందరు దర్శక, నిర్మాతల కారణంగా తనకు మంచి అవకాశాలు వచ్చాయి అని భూమి పెడ్నేకర్ అంటోంది. కాకపోతే, తన సక్సెస్ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయని భూమి పెడ్నేకర్ నర్మగర్భంగా కామెంట్స్ చేసింది.
భూమి పెడ్నేకర్ ఇంకా మాట్లాడుతూ..“దీపిక పదుకోన్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యింది. నిజానికి నాకు దీపికని చూసిన తర్వాతే నా వంటి కలర్ గురించి, నా లుక్స్ గురించి వర్రీ కావొద్దని ధీమా వచ్చింది. ఇంకా చెప్పాలంటే నా రంగు పొంగులను చూసి అందరూ గర్వంగా చెప్పుకోవాలి అని నేను అనుకోలేదు. భూమి పెడ్నేకర్ మంచి నటి, పాత్ర కోసం శరీరాన్నే కాదు, ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంది అని అనుకోవాలి’ అంటూ భూమి పెడ్నేకర్ చెప్పుకొచ్చింది.
Also Read:సోదరా.. మోషన్ పోస్టర్
మొత్తమ్మీద తన ఛామన ఛాయ లేదా నలుపు కలర్ గురించి భూమి పెడ్నేకర్ బాగానే చెప్తోంది. కానీ ఫోటోషూట్ లలో మాత్రం తెల్లగా కనిపించేలా ఎందుకు మేకప్ వేసుకుంటుంది అనేదానికి భూమి పెడ్నేకర్ సమాధానం ఇస్తే బాగుండేది. ఏది ఏమైనా మైండ్ బ్లాక్ అయ్యేలా సోయగాల వల విసురుతూ ఉండే భూమి పెడ్నేకర్ అంటే యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే, ఆమె నటించే వెబ్ సిరీస్ లకు ఫుల్ డిమాండ్ ఉంది.
Also Read:సోదరా.. మోషన్ పోస్టర్