బీజేపీలో రాజాసింగ్ రగడ?

36
- Advertisement -

మత విద్వేషాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీలో గత ఏడాది గోషామహల్ రాజసింగ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం అయ్యాయో అందరికీ తెలిసిందే. ముస్లిం మతాన్ని కించపరుస్తూ మహ్మద్ ప్రవక్త పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశంలోనే పెను దూరమరాన్ని రాపాయి. ఇతర మాటల పట్ల బీజేపీ ఎలాంటి వైఖరితో ఉంటుందో రాజసింగ్ వ్యాఖ్యలను బట్టి అందరికీ అర్థమైంది. ఈ క్రమంలోనే రాజసింగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా జైలు శిక్షను కూడా అనుభవించారు. అయితే ఇతర మతాలపై కపట ప్రేమ చూపించే బీజేపీ రాజసింగ్ నామమాత్రంగా హెచ్చరిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. .

అయితే ఆ సస్పెన్షన్ ఎంతో కాలం ఉండదని యావత్ ప్రజానీకానికి తెలియందేమీ కాదు. అందరూ అనుకున్నట్లుగానే సరిగా ఎన్నికల ముందు ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఇటీవల ప్రకటించిన మొదటి జాబితాలో ఆయన పేరు ప్రస్తావిస్తూ గోషామహల్ టికెట్ కన్ఫమ్ చేసింది. దీంతో ఇతర నేతల నుంచి వ్యతిరేకత తివ్ర స్థాయిలో కనిపిస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఈ సీటు కోసం మొదటి నుంచి తెగ ప్రయత్నిస్తున్నారు.

రాజసింగ్ పై ఉన్న సస్పెన్షన్ కారణంగా తనకే టికెట్ లభిస్తుందని భావించారయన. కానీ ఊహించని రీతిలో రాజసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు గోషామహల్ టికెట్ కూడా ఒకే చేయడంతో ముఖేష్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట. నిజమైన పార్టీ నేతలకు టికెట్లు కేటాయించడంలో అధిష్టానం నిర్లక్షం చూపుతుందని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికే కాషాయ పార్టీ ప్రదాన్యం ఇస్తోందనే అసంతృప్తి ముఖేష్ గౌడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరికొంత మంది కూడా రాజసింగ్ కు సీటు కేటాయించడంపై అసహనంగానే ఉన్నారట. మొత్తానికి రాజసింగ్ వ్యవహారం పార్టీలో కొత్త తలనొప్పులకు తెరతీస్తోంది.

Also Read:మళ్లీ మృణాల్ తోనే ఫిక్స్ అట

- Advertisement -