4నెలల కష్టం, 4సెకన్లే..!

273
sudheer babu sweats it out
sudheer babu sweats it out
- Advertisement -

సినిమా నటన అంటే ఆషామాషి కాదు. ప్రతి నటుడికి, ప్రతి సినిమా పరీక్షగా మారింది. ఒకటి రెండు సినిమాలు విజయవంతమైనంత మాత్రానా మన పరిస్థితి బావుంది అని భావించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సినీరంగంలో పోటీ ఎక్కువ. ప్రతిసారి కొత్తదనం చూపించాలి. లేదంటే ప్రేక్షకులు పెదవి విరుస్తారు. అందుకే తాము నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి టాలీవుడ్‌ హీరోలు ప్రయత్నిస్తుంటారు. కేవలం కథలోనే కాదు గెటప్‌లో, బాడీ లాంగ్వేజీలో సైతం వైవిథ్యం చూపించాలి. ఇందులో భాగంగా శరీరాకృతిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కలల్లో కథానాయకులు కండలు తిరిగి ఉంటారు. పాత్రపరంగా అలాంటి శరీరాకృతి అవసరం అనుకుంటే ఆరు పలకల్లోకి (సిక్స్‌ ప్యాక్‌ ) మారడానికి టాలీవుడ్‌ హీరోలు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆ కష్టంపై రియాక్ట్ అయిన సుధీర్ బాబు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

బాఘీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. సిక్స్‌ ప్యాక్ తో విలన్‌గా కనిపించి అందర్నీ మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఆయన నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, ఆదితో కలిసి ‘శమంతకమణి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా బాడీ షూట్‌కు సిద్ధమైనట్లు సుధీర్‌ బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

sudeer babu

‘కనీసం 4 నెలలు కష్టపడితే కానీ అలాంటి బాడీని బిల్డ్ చేయడం సాధ్యం కాదు. కానీ ఆ బాడీని స్క్రీన్ పై కేవలం 4 సెకన్లు మాత్రమే చూపిస్తారు. ఆ విషయం ముందే తెలిసినా అంతగా కష్టపడేందుకు కారణం ఉంది. రేపు నేను చనిపోయిన తర్వాత కూడా ఆ నాలుగు సెకన్లు అందరికీ కనిపిస్తుంది. అందుకే ఆ 4 సెకన్లకు అంత విలువ ఇవ్వాల్సి ఉంటుంది’ అని చెప్పాడు సుధీర్ బాబు.

- Advertisement -