ప్రభాస్‌ తో అలా జరిగిపోయింది..

181
Kangana Ranaut has had fights with Baahubali's
- Advertisement -

దేశమంతా బాహుబలి మేనియాతో ఊగిపోతోంది. ఆ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ గురించి దేశమంతా ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటోంది.  ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రభాస్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. గతంలో ప్రభాస్‌తో కలిసి ‘ఏక్‌నిరంజన్‌’ సినిమాలో నటించిన బాలీవుడ్‌  హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

Kangana Ranaut has had fights with Baahubali's

అయితే తాజాగా కంగన.. మరోసారి ‘ఏక్ నిరంజన్’ ఊసెత్తింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ప్రభాస్ తో గొడవైనట్లు ఆమె వెల్లడించడం గమనార్హం.  ‘నేను గతంలో ప్రభాస్‌తో కలిసి ఏక్‌నిరంజన్‌ సినిమాలో నటించాను. ఆ సమయంలో ప్రభాస్‌కు, నాకు మధ్య ఓ చిన్న విషయం మీద గొడవైంది.  అప్పట్నుంచి ప్రభాస్‌తో మాట్లాడడం మానేశాను. ఇప్పటికీ ప్రభాస్‌తో మాట్లాడింది లేదు. ఇటీవలె బాహుబలి: ది కంక్లూజన్‌ సినిమా చూశాను.
Kangana Ranaut has had fights with Baahubali's
బాహుబలి పాత్రలో ప్రభాస్‌ నటన అద్భుతం. ఏక్‌నిరంజన్‌కు, ఇప్పటికి ప్రభాస్‌ ఎంతో ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అలాంటి నటుడితో కలిసి నటించినందుకు గర్వంగా ఉంద’ని చెప్పింది కంగన. ఇక ‘ఏక్ నిరంజన్’ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు ఈ అమ్మడు.  కారణమేంటని కంగనను అడిగితే.. తాను సౌత్ సినిమా నేటివిటీకి పనికిరానేమో అని తనదైన శైలిలో చెప్పింది కంగన.

- Advertisement -