- Advertisement -
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఆమె చాలా బోల్డ్ గా ఉంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐరా ఖాన్ పలు అంశాలపై స్పందించింది. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని అంగీకరించడానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందని ఐరా ఖాన్ చెప్పారు. ఇంటర్వ్యూలో ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘కాలేజీ రోజుల్లోనే నాకు మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించినప్పటికీ, నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు పరిస్థితి దిగజారింది. తినడం కూడా మానేశా. చనిపోవాలని అనిపించింది అని ఆమె ఏమోషనల్ అయ్యింది.
అనంతరం తేరుకుని ఐరా ఖాన్ మాట్లాడుతూ.. ఆ టైంలో నా కుటుంబసభ్యులు నాకు చాలా బాగా అండగా నిలిచారు. ఆ తర్వాత నా కాబోయే భర్త నుపుర్ కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. ఓ సమయంలో నేను ఓ వ్యక్తితో చనువుగా ఉండేదాన్ని. అయితే, ఆ వ్యక్తి నన్ను అన్ని రకాలుగా వాడుకుని.. ఆర్థికంగా కూడా మోసం చేశాడు. అప్పుడే నాకు నుపుర్ పరిచయం అయ్యాడు. మొదట్లో నేను నుపుర్ స్నేహితుడిగానే చూశాను. కాలం గడిచే కొద్దీ మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అందుకే మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అని ఐరా చెప్పుకొచ్చింది.
ఆ మధ్య మీ బోల్డ్ బికినీ ఫొటో ఒకటి బాగా వైరల్ అయ్యింది. పక్కన మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఉన్నారు. మీ తండ్రి ముందే మీరు అలా బికినీ వేసుకోవడం ఇబ్బందిగా అనిపించలేదా అని సదరు యాంకర్ అడిగితే.. ఐరా మాట్లాడుతూ.. ఆ ఫోటో నా ప్రమేయం లేకుండా ఎవరో తీశారు. అయితే ఆ ఫొటో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసింది. నా బికినీకి అంత స్పందన వస్తోంది అని నేను ఊహించలేదు. నాకు మాత్రం ఆ స్పందన బాగా నచ్చింది అంటూ ఐరా చెప్పింది.
Also Read:శ్రీలీల – కాజల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
- Advertisement -