జిట్టా ఉంటే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఉండకపోయేవాడు:కేటీఆర్

31
- Advertisement -

భువనగిరిలో ఉద్యమ సయంలో నడిపింది జిట్టానే అని..జిట్టా పార్టీలో ఉంటే ఈ రోజు ఫైళ్ల శేఖర్ రెడ్డి ఉండకపోయేవాడన్నారు మంత్రి కేటీఆర్. జిట్టా చేరిక సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..తప్పియిన కొడుకు సాయంత్రం ఇంటికి వచ్చినట్లుగా జిట్టా పునరాగమనం ఉందన్నారు. ఇక్కడ ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది..ఒకే వేదిక మీద అన్నివిభాగాల వారు ఉండం సంతోషంగా ఉందన్నారు.

కొన్ని గద్దలు తెలంగాణపై దాడి చేయడానికి కాచుకు కూర్చున్నాయి…మన అధికారం ఇస్తే తెలంగాణ పాలించే చేతగాదని అవహేళన చేశారన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అమర వీరులు స్థూపం దగ్గరకు రమ్మని సవాల్ విసిరడం విడ్డూరం అని…సోనియా గాంధీ వందల మంది బలిగొన్న బలిదేవత అని స్వయంగా రేవంత్ అన్నాడు..హంతకుడే నివాళులు అర్పించినట్లుగా రేవంత్ తీరు ఉందన్నారు.

కలికాలంలో విచిత్రాలు జరగుతాయని వింటాం కానీ రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే అది నిజమే అన్నట్లు అనిపిస్తుందన్నారు. డబ్బులు పంచుతూ దొరికిన రేవంత్ రెడ్డి డబ్బులపైన శపథం చేయడం విడ్డూరం అని…సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి వద్ద అడుక్కునే వాల్లు అని అవమానపరుస్తున్నారన్నారు.అన్నీ పార్టీలోని తెలంగాణ నాయకులు ఒక సారి ఆలోచించాలి..తెలంగాణ అస్థిత్వం మీద దాడి జరుగుతుంటే చూస్తూ ఉందామా అని ప్రశ్నించారు. తెగించి తెలంగాణ ను తెచ్చిన కేసీఆర్ కు అండగా ఉందామా ఆలోచించండన్నారు. తెలంగాణ కొంప ముంచిదే కాంగ్రెస్..తెలంగాణ ప్రజలను గోసపెట్టిందే కాంగ్రెస్..తెలంగాణ ప్రజలను అవమానపరించింది కాంగ్రెస్ అన్నారు.

2001లో చీకట్లో చిరు దీపంతో ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ ఇచ్చేలా అనివార్యతను కేసీఆర్ సృష్టించాడని..9 నెలల క్రితమే అసెంబ్లీలో బీసీ కుల గణన జరగాలని తీర్మానం చేశాం అన్నారు.అసెంబ్లీ తీర్మానం చేయడమే కాకుండా కేంద్రం కుల గణన చేయాలని తీర్మానం పంపాం..కొత్తగా ఇప్పుడు రాహుల్ గాంధీ కుల గణన చేస్తామని చెబుతున్నారన్నారు.

Also Read:21న సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు..

- Advertisement -