మెహ్రీన్ పై దారుణమైన రేప్ సీన్

224
- Advertisement -

ప్రతి వారం కేవలం థియేటర్స్ లోనే దాదాపు డజన్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక ఓటీటీల పరిస్థితి చెప్పాలా ?, నిత్యం సరికొత్త కంటెంట్ వస్తూనే ఉంది. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా.. కాస్త ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించాలి అంటే.. ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది. అందులోనూ స్టార్లు లేని వెబ్ సిరీస్ ల పరిస్థితి మరీ అద్వానం. ఎస్, అదే మనం చెప్పుకోవాలి ఇక్కడ, ఇప్పుడు… మెహ్రీన్ పిర్జాదా సౌత్ ఇండస్ట్రీలోనే మంచి హీరోయిన్. నంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా, హిట్ హీరోయిన్ గా ఆమెకు సౌత్ లో కాస్త క్రేజ్ ఉంది. అలాగే మంచి గుర్తింపు ఉంది.

ఫేడ్ అవుట్ అవుతున్నా సరే సినిమాలను మాత్రం మెహ్రీన్ తగ్గించడం లేదు. అఫ్‌కోర్స్, మెహ్రీన్ మంచి నటే… కానీ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ నిర్మాత దర్శకులు ఆమెను జస్ట్ కేవలం ప్రచారం కోసం, ప్రేక్షకుల లుక్ పడటం కోసం మాత్రమే వాడుకున్నారు. సిరీస్ లో ఆమె పై అయిదారు బోల్డ్ సీన్లు పెట్టారు. నిజానికి కథలో మెహ్రీన్ పాత్రకు అస్సలు వాల్యూ లేదు. ఆ పాత్రలో మెహ్రీన్ కాకపోయినా.. మరొకరు అయినా పెద్దగా పోయేది ఏమీ లేదు. కానీ, సిరీస్ లో మెహ్రీన్ పై రేప్ సీన్లు, హాట్ సీన్లు పెడితే.. సౌత్ జనం కూడా చూస్తారని, మెహ్రీన్ పై దారుణమైన బోల్డ్ సీన్లు తీశారు.

ఇక ఈ సీన్లు చూసి.. తనకు కూడా తమన్నా లాంటి ఇమేజ్ అండ్ క్రేజ్ వస్తోంది అని భావించిన మెహ్రీన్.. ఇప్పుడు తెగ ఫీల్ అయిపోతుంది. ఈ క్రమంలో మెహ్రీన్ మీడియా, సోషల్ మీడియా పై మండిపడుతోంది. సెక్స్ సీన్‌కు, దారుణమైన రేప్ సీన్‌కు తేడా తెలియదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి తర్వాత బెడ్ రూమ్ లో భర్త చేసే దారుణమైన రేప్ సీన్ ను కొందరు సెక్స్ సీన్ అని రాస్తున్నారంటూ మెహ్రీన్ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ లో మెహ్రీన్ లిప్ లాక్, సెక్స్ సీన్లు చేసినా పెద్దగా ఆమెకు ప్లస్ కాలేదు. కాకపోతే అవి వైరల్ అవుతున్నాయి.

Also Read:స్టార్ హీరో సినిమాకి మినిస్టర్ రివ్యూ

- Advertisement -