హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ దస్ పల్లా హోటల్ లో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సిఏ ప్యానల్ మీడియా సమావేశం నిర్వహించింది. పోటీలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా జగన్ మోహన్ రావు,వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా శ్రీధర్,సెక్రెటరీ గా డా.ఆర్.హరినారాయణ రావు,జాయింట్ సెక్రెటరీ గా నోయేల్ డేవిడ్,ట్రెజరర్ గా శ్రీనివాస్ రావు,కౌన్సిలర్ గా డా.అన్సార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.
ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్ష అభ్యర్థి జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. క్రికెట్ లో అనుభవం ఉన్న వారిని పైకి తెస్తాం అన్నారు. హెచ్సీఏలో ఎన్ని లూప్ హెల్సో ఉన్నాయో వాటన్నింటిని సాల్వ్ చేస్తామని చెప్పారు. హెచ్సీఏ తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. తెలంగాణ జిల్లల నుండి క్రికెటర్స్ ని ప్రోత్సహించి రంజీ నుండి ఇండియా కి తీసుకువెళ్తాం అన్నారు. నా చిన్నతనంలో మన హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు సంఖ్య తక్కువ ఉందని…హ్యాండ్ బాల్ హైదరాబాద్ తీసుకువస్తానని చెప్పా ఇప్పుడు కూడా hca కి మంచి పేరు తీసుకువస్తానన్నారు.
Also Read:కాంగ్రెస్లో తగ్గని కన్ఫ్యూజన్ గోల?
లోదా కమిషన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని…పిచ్చి పిచ్చి వాగుడు వాగితే కర్ర కాలిచి వాత పెడుతానని చెప్పారు. తప్పు చేసిన వాళ్లను క్షమించే ప్రసక్తి లేదని…అవినీతిని అరికడతామన్నారు. తానే కొత్తవాడిని కాదని హెచ్సీఏ మెంబర్నని తెలిపారు. నా ప్యానెల్ లో అందరూ నిజాయితిపరులు అని…వెనుకుండి నడిపించే శక్తులకు ఇక చెల్లు అన్నారు. హెచ్సీఏలో మంచి పాలన అందిస్తామని…ఎవరైనా లంచాలు ఇస్తే వారిని మూడు సంవత్సరాలు బ్యాన్ చేస్తామన్నారు. ప్రతి జిల్లాకి క్రికెట్ వెళ్లాలని…నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ కవిత 30 ఎకరాలు ఇప్పిస్తామని అన్నారు.నేను పోటీ చేస్తున్న అని తెలియగానే అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు జిల్లాలో స్టేడియాల నిర్మాణం కోసం సపోర్ట్ చేస్తామంటున్నారన్నారు. .
Hca కి బ్యాడ్ నేమ్ వచ్చిందన్నారు సెక్రెటరీ అభ్యర్థి, డా.హరినారాయణ రావు. మళ్ళీ గాడిలో పెట్టేందుకు మేం ముందుకు వచ్చామని…మాకు ఎలాంటి దురభిప్రాయం లేదు సదుద్దేశంతో ఈ hca బాగు కోసం పోటీలో దిగాం అన్నారు. జిల్లాలో కూడా ఇంకో స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం అని…ప్లేయర్స్ కి మినిమం ఫెసిలిటీస్ ఇస్తాం అన్నారు. సీనియర్ ప్లేయర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని..క్లబ్ మెంబర్స్ కి మంచి గౌరవం అందిస్తాం అన్నారు.
Also Read:CM KCR:కేసిఆర్ తో ఢీ కొట్టి నిలిచేరా?